S kota constituency: ఎస్‌ కోట ఎవరికి కోటగా మారుతుందో..!

S kota Constituency: విజయనగరం జిల్లాలోని మరో నియోజకవర్గం శృంగవరపు కోట. ఈ నియోజకవర్గం ఏర్పాటైన తరువాత తొలిసారి 1951లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 18 ఎన్నికలు జరిగాయి.

Continues below advertisement

S kota constituency: విజయనగరం జిల్లాలోని మరో నియోజకవర్గం శృంగవరపు కోట. ఈ నియోజకవర్గం ఏర్పాటైన తరువాత తొలిసారి 1951లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి 18 ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఏడుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఐదుసార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. నియోజకవర్గంలో ప్రస్తుతం 2,50,429 మంది ఓటర్లు ఉండగా, 1,22,036 మంది పురుష ఓటర్లు, 1,28,362 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం విశాఖ పార్లమెంట్‌ స్థానం పరిధిలోకి వస్తుంది. 

Continues below advertisement

ఇదీ ఎన్నికలు తీరు

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల తీరును పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గంగా ఇది కనిపిస్తుంది. 1952లో తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో సోషలిస్టు పార్టీకి చెందిన సీవీ సోమయాజులు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన టి వెంకటరామయ్యపై 11,688 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1953లో జరిగిన ఉప ఎన్నికల్లో పీఎస్సీ నుంచి పోటీ చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు ఏకగ్రీవంగా ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. 1955లో జరిగిన ద్విసభ ఎన్నికల్లో పీఎస్సీ నుంచి పోటీ చేసిన సీవీ సోమయాజులు మరోసారి విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జీబీ అప్పారావుపై 5468 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. ఇదే ఏడాది జరిగిన జరిగిన ఎన్నికల్లో పీఎస్సీ నుంచి పోటీ చేసిన జీఆర్‌ నాయుడు విజయాన్ని సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కె వీరన్న పడాల్‌పై 11,848 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1960లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జీడీ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1962లో జరిగిన ఎన్నికల్లో జీడీ నాయుడు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి మరోసారి ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టి రాములపై 8908 ఓట్ల తేడాతో విజయం సాఽధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కె అప్పలనాయుడు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కేవీఆర్‌పీఎస్‌పీ రాజుపై 2572 ఓట్ల తేడాతో గెలుపొందారు. 

Also Read: నెల్లిమర్లలో రెపరెపలాడే జెండే ఏదో? ఇరు పార్టీలకు కీలకం

1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కేవీఆర్‌పీఎస్‌పీ రాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కె అప్పలనాయుడుపై 13,900 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన డి సన్యాసిదొర ఇక్కడి నుంచి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఐపీ బాలరాజుపై 5363 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎల్‌బీ దుక్కు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జి దొరపై 27,185 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎల్‌బీ దుక్కు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జి దొరపై 28,835 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎల్‌బీ దుక్కు మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎస్‌ రామచంద్రరరావుపై 6746 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన శోభా హైమావతి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన గంగాధరస్వామి శెట్టిపై 678 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కుంభా రవిబాబు విజయాన్ని సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన శోభాహైమావతిపై 5802 ఓట్ల తేడాతో ఆయన విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కోళ్ల లలిత కుమారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జోగినాయుడిపై 3440 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసిన కోళ్ల లలిత కుమారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన కె శ్రీనివాస్‌పై 28,572 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కె శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన కోళ్ల లలిత కుమారిపై 11,246 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రానున్న ఎన్నికలు ఇక్కడ ఆసక్తిని రేపుతున్నాయి. టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసేందుకు కోళ్ల లలిత కుమారి సిద్ధపడుతున్నారు. మరో ఇద్దరు అభ్యర్థులు కూడా టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యేతోపాటు మరో ముగ్గురు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. టికెట్‌ ఎవరికి ఇస్తారన్న దానిని బట్టి ఇక్కడ పోటీ నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: కురుపాం గడ్డ ఎవరికి అడ్డాగా నిలుస్తుందో!

Continues below advertisement