JP Sensational Comments : లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయ్‌ప్రకాశ్‌ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనపై ఆయన చేసిన హాట్‌ కామెంట్స్‌ ఇప్పుడు సోసల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో రాష్ట్రంలో వైసీపీ పాలనపై జేపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తుగ్లక్‌ రాజ్యం తరహాలో పాలన సాగుతోందన్న రీతిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు రాష్ట్రంలో పాలన బాగుందంటూ కితాబిచ్చిన ఆయన.. పరిపాలన వికేంద్రీకరణకు అనుగుణంగా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయాల విధానాన్ని ప్రశంసించారు. అటువంటి ఆయనే తాజాగా ఏపీలోని వైసీపీ పాలనపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాయి. ప్రస్తుతం జేపీ చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రతిపక్షాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఇదీ వైసీపీ పాలనపై ప్రముఖల అభిప్రాయం అంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ చేస్తున్నారు. 


జేపీ ఏమన్నారంటే


ఒక ఇంటర్వ్యూలో జేపీ మాటాలడుతూ ఏపీ పాలనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ’ఏపీలో నేతలు గీత దాటి వ్యవహరిస్తున్నారు. కనీస మర్యాదలు పాటించడ లేదు. తుగ్లక్‌ రాజ్యం ఒక పక్కన. నువ్వు ఏం చేసినా అడ్డుకుంటా. బస్తీ మే సవాల్‌ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగమే రాజధానిని ఆపేయడం కావచ్చు. గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీని ఆపేయడం కావచ్చు. పోలవరం ఆపేయడం కావచ్చు. ఎన్ని మాటలు చెప్పినా పోలవరం బ్రహ్మాండంగా జరగడం లేదు’ అంటూ వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వచ్చినా, రాకపోయనా.. బోడి వచ్చేది ఏంటి అన్న భావనలో ఇక్కడ నేతలు ఉన్నారంటూ జేపీ విమర్శించారు. ఇక్కడ ఒక గూండా రాజ్యం తెస్తున్నారన్న భావనను కలిగించారని జేపీ ఆరోపించారు. ’తెలంగాణలో చట్టబద్ధ పాలన లేదు. కానీ, చంద్రబాబు, కేసీఆర్‌, రేవంత్‌, మరొకరు గానీ.. శ్రీనివాస్‌ ప్రత్యర్థి కాబట్టి తలకాయ తీసేయాలన్న పరిస్థితి లేదు. తప్పులు చేస్తున్నారు. ఎక్కడ ఒకచోట గీత ఆ నేతలకు ఉంది. ఏపీలో కచ్ఛితంగా ఆ గీత దాటి వ్యవహరిస్తున్నారు. కనీస మర్యాద పాటించడం లేదు’ అంటూ జేపీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి.


Also Read:  సీటు పరేషాన్‌, మొన్నటి వరకు వైసీపీ- ఇప్పుడు టీడీపీలో జంపింగ్‌లు


Also Read: అభ్యర్థుల ఎంపికలో జగన్‌ సరికొత్త ప్రయోగం