ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్ ) - 2021 పరీక్ష హాల్‌టికెట్లు ఈ రోజు (సెప్టెంబర్ 10) విడుదలయ్యాయి. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఈ హాల్ టికెట్లను విడుదల చేసింది. ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్షలను ఈ నెల 21న నిర్వహించనున్నట్లు వర్సిటీ తెలిపింది. ఆబ్జెక్టివ్ విధానంలో (ఎంసీక్యూ ఫార్మెట్) పరీక్ష జరగనుంది. ఎడ్‌సెట్‌ పరీక్షను 21న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు (ఒకే సెషన్‌) పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్‌ కే.విశ్వేశ్వరరావు తెలిపారు. పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ సహా మరిన్ని వివరాల కోసం ఎడ్‌సెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 


ఏపీ ఎడ్‌సెట్‌ హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోండిలా.. 



  • ఎడ్‌సెట్‌ అధికారిక వెబ్ సైట్ sche.ap.gov.in ను ఓపెన్ చేయండి. 

  • ఇందులో EDCET 2021 అని ఉన్న ఆప్షన్ క్లిక్ చేయండి. 

  • దీంతో మరో విండో ఓపెన్ అవుతుంది. ఇందులో డౌన్‌లోడ్ హాల్ టికెట్ అనే లింక్ కనిపిస్తుంది. దీనిని ఎంచుకోండి. 

  • అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. 

  • దీంతో హాల్ టికెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 

  • భవిష్యత్ అవసరాల కోసం దీనిని డౌన్ లోడ్ చేసుకోవాలి.  


మాక్ టెస్ట్ సదుపాయం కూడా ఉంది...
ఎడ్‌సెట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం మాక్ టెస్ట్ సదుపాయం కూడా కల్పించారు. దీని కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. దీనిలో మాక్ టెస్ట్ ఆప్షన్ ఎంచుకుంటే.. బయోలజీ, ఫిజిక్స్, సోషల్, మాథ్స్, ఇంగ్లిష్ అనే ఐదు సబ్జెక్టులు కనిపిస్తాయి.. మీకు కావాల్సిన సబ్జెక్టును ఎంచుకుని మాక్ టెస్ట్ రాయవచ్చు. పరీక్ష సమయం 120 నిమిషాలుగా ఉంది. బీఏ /బీఎస్సీ /బీఎస్సీ (హోం సైన్స్) /బీసీఏ/ బీకాం /బీబీఎం పూర్తి చేసిన లేదా చివరి ఏడాదిలో ఉన్న అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ లేదా బీటెక్‌లో 55 శాతం మార్కులతో పాస్ అయిన వారు కూడా ఈ పరీక్ష రాయవచ్చు. ఎడ్‌సెట్‌ ద్వారా బీఈడీ కోర్సుల్లో చేరవచ్చు. 


ఎడ్‌సెట్‌ పరీక్ష కేంద్రాలు.. 
విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, తిరుపతి, కడప, భీమవరం, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళంలలో ఎడ్‌సెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. 


Also Read: Laptops To Students: జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన స్థానంలో ల్యాప్‌టాప్‌లు... టెండర్లు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం


Also Read: AP New Chief Secretary: ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ... ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరణ