దేశంలో రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. కొత్తగా 34,973 కరోనా కేసులు నమోదుకాగా, 260 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.


యాక్టివ్ కేసుల సంఖ్య 3,90,646కి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1.18గా ఉంది. రికవరీ రేటు 97.49కి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.31 శాతంగా ఉంది. గత 77 రోజుల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువే ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 11 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదైెంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 53.86 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు.


Also Read: D2 strain: ఉత్తర్ ప్రదేశ్ లో డెంగీ విజృంభణ... డెంగీ మరణాలకు డీ2 స్ట్రైయిన్ కారణం... ప్రాణాంతక రక్తస్రావం కలిగిస్తుందంటున్న ఐసీఎంఆర్ వైద్యులు






యాక్టివ్ కేసులు: 3,90,646
మొత్తం కేసులు: 3,31,74,954
మొత్తం రికవరీలు: 3,23,42,299
మొత్తం మరణాలు: 4,42,009
మొత్తం వ్యాక్సినేషన్: 72,37,84,586


 ఇప్పటివరకు 72.37 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను కేంద్ర ఆరోగ్యశాఖ పంపిణీ చేసింది. 






రాష్ట్రాల్లో కరోనా కేసులు..


గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 68.59 శాతం కేరళలోనే వెలుగు చూసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. 


కేరళలో గురువారం 26,200- కేసులు నమోదుకాగా 125 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 43,09,694కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 22,126కి పెరిగింది.


మహారాష్ట్రలో కొత్తగా 4,219 కరోనా కేసులు నమోదయ్యాయి. 55 మంది వైరస్ తో మృతి చెందారు. 


Also Read: Covid vaccine: వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా ముప్పు జయించినట్టే.. కేంద్రం కీలక ప్రకటన