ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రధాన కార్యదర్శిగా సమీర్‌ శర్మ నియమితులయ్యారు. ఆయన అక్టోబర్‌ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ సమీర్‌ శర్మ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఇప్పటికే మూడు నెలల ఎక్స్ టెన్షన్‌లో ఉన్నారు.  సమీర్ శర్మ ప్రస్తుతం ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఈ నెల 30న ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ విరమణ చేయనున్నారు. 


Also Read: తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడి సందడి.. ఖైరతాబాద్ లో భక్తుల కిటకిట.. కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు



Also Read: Rajinikanth Annaatthe first look : పంచెకట్టుతో రజినీ.. లుక్ అదుర్స్ కదూ.. 


అక్టోబర్ ఒకటో తేదీన బాధ్యతులు


ఏపీ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ప్రణాళికా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్ గవర్నెన్స్ సంస్థ వైస్ ఛైర్మన్, సభ్య కార్యదర్శిగా ఉన్నారు. జూన్ 30 తేదీనే ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆదిత్యనాథ్‌ దాస్‌ సర్వీసును కేంద్రం సెప్టెంబర్‌ వరకు పొడిగించింది. అక్టోబర్ ఒకటో తేదీన కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.


Also Read: Vidyullekha Raman : బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్..


పబ్లిక్, కార్పొరేట్ వ్యవహారాలలో అపారమైన అనుభవం


డాక్టర్ సమీర్ శర్మ ఐఎఎస్, 1985 బ్యాచ్‌కు చెందిన స్కాలర్, అడ్మినిస్ట్రేటర్. ఆయనకు పబ్లిక్, కార్పొరేట్ వ్యవహారాలలో అపారమైన అనుభవం ఉంది. సమీర్ శర్మకు పబ్లిక్ సర్వీస్ లో 37 సంవత్సరాల అనుభవం ఉంది.  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలో పట్టణ రంగంలో అనేక పదవులను నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. డా.సమీర్ శర్మ అమెరికాలో కమ్యూనిటీ ప్లానింగ్‌లో మాస్టర్స్ చేశారు. దీనిపై డాక్టరేట్ పొందారు. 


Also Read: పెద్దపల్లి జిల్లాలో 8 వందల ఏళ్ల నాటి మూషిక విగ్రహం.. తెలంగాణలో ఇదే పెద్దదట


Also Read: Bankers Meeting: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం.. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరిన ఏపీ సీఎం జగన్