పెద్దపల్లి జిల్లాలో 8 వందల ఏళ్ల నాటి మూషిక విగ్రహం.. తెలంగాణలో ఇదే పెద్దదట

Continues below advertisement

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణానికి సమీపంలోని గోదావరి నది పక్కన జనగామ అనే గ్రామం ఉంది. ఇక్కడ కాకతీయుల కాలంనాటి త్రి లింగ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గరలో  8 వందల ఏళ్లనాటి అరుదైన మూషిక విగ్రహాన్ని చరిత్ర పరిశోధకులు కనుగొన్నారు. త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎదుట శిథిలావస్థలో ఉన్న త్రికూటాలయం వెనక పొదల మధ్య ఈ మూషిక విగ్రహం బయటపడింది. తెలంగాణలోనే అతి పెద్ద, అరుదైన మూషిక విగ్రహమని చరిత్రకారులు చెబుతున్నారు. గుప్త నిధుల కోసం ఈ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెలికిలించి ఉంటారని అంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram