Medicine From The Sky: ఆకాశంలో డ్రోన్లు.. ఎగురుతూ వస్తోన్న వ్యాక్సిన్లు
తెలంగాణలో డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్లు సరఫరా సెప్టెంబర్ 11న ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు ట్రయల్‌రన్ విజయవంతమైంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదగా మెడిసన్ ఫ్రం స్కై ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేశారు. రాష్ట్రమంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తొలుత జిల్లా నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్ అందుతుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ట్రయల్‌రన్ నిర్వహించారు. స్కై ఎయిర్ మొబిలిటీ, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ స్టారప్ సహకారంతో మందులు, కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీకి కసరత్తు జరుగుతోంది.
Tags :
Telangana Drone Vikarabad Medicine From The Sky Medicine From The Sky Project Medicine From Drones COvid Vaccine From Drones Covid-19