Chandragiri Crime :  ప్రేమ పెళ్లిని అంగీకరించని యువతి కుటుంబ సభ్యులు ప్రియుడి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. తలుపులు పగలగొట్టి యువతిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు.  తిరుపతి‌ జిల్లా చంద్రగిరిలో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. 


అసలేం జరిగింది? 


తిరుపతి‌ జిల్లా బుచ్చినాయుడు పల్లి పంచాయతీలో మోహన్ రెడ్డి కాలనీకి చెందిన మోహనకృష్ణ గుంటూరుకు చెందిన డాక్టర్ సుష్మాను రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి సుష్మా మోహన్ కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి మోహన్ రెడ్డి కాలనీలో ఉంటుంది. కుమార్తె ప్రేమ వివాహాన్ని అంగీకరించని  కుటుంబ సభ్యులు, తమ స్నేహితులు, బంధువుల ముందు పరువు పోయిందనే కారణంతో మోహన్ కృష్ణను వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. కానీ అవేవి పట్టించుకోకుండా సుష్మా, మోహన్ కృష్ణలు వైద్య వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు సుష్మాను తీసుకెళ్లేందుకు రెండు నెలల పాటు వివిధ రకాలుగా ప్రయత్నించారు. సుష్మా అంగీకరించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సుమారు 30 మందితో గురువారం అర్ధరాత్రి మోహనకృష్ణ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్దాలు, టీవీ, ఫర్నిచర్, తలుపులు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. గదిలో ఉన్న సుష్మాను బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. మోహనకృష్ణ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.  


జైలర్ ఇంటికి నిప్పు పెట్టిన దొంగ


జైలులో సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పడంతో కోపం పెంచుకున్న ఓ దొంగ.. జైలర్‌ ఇంట్లో సామాన్లు ధ్వంసం చేయడంతోపాటు వాటిని తగులబెట్టాడు. ఇంట్లో ఉన్న సర్టిఫికెట్లను ముక్కలుగా కత్తిరించి తన కోపాన్ని ప్రదర్శించాడు. దొంగ చేసిన ఈ పని ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన సోమాచారి అనే దొంగను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇతను చేసిన నేర ప్రవృత్తి గురించి పోలీసులు చెప్పిన విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి. సత్తుపల్లి సీఐ కరుణాకర్‌ చెప్పిన వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి పట్టణంలోని అడపా సత్యనారాయణ వీదికి చెందిన నడిపల్లి రామారావు ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ.10 లక్షల మేర నగుదు, ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై ధర్యాప్తు చేసిన పోలీసులు సీసీ పుటేజీల ఆదారంగా పాత నేరస్తుడు అయిన సోమాచారి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. చోరీ చేసిన సమయంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేసేందుకు సోమాచారి విఫలయత్నం చేశాడు. 


Also Read : Sathupally Crime మంచిగా ఉండాలని సూచిస్తే, ఏకంగా ఇల్లు తగులబెట్టాడు - పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు


Also Read : Selfie Suicide : 'రాజు నేనేం పాపం చేశాను', ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి సెల్ఫీ సూసైడ్