Jagitial News: జగిత్యాల జిల్లాలో విషాధం చోటు చేసుకుంది. గత రెండు రోజుల క్రితం మల్యాల మండలం తాటిపల్లి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో బింగి ప్రసాద్ అర్చకుడు గల్లంతయ్యాడు. దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా ఇత్తడి విగ్రహాన్ని కడిగేందుకు ఎస్సారెస్పీ కెనాల్ లో దిగి కాలుజారి నీటిలో పడిపోయాడు. స్థానికులంతా గంటలపాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. అనంతరం పోలీసులుకు సమాచారం అందించారు. అప్పటి నుంచి ఈరోజు వరకు పూజారి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజ చొప్పదండి మండలం రేవల్లే ఎస్సారెస్పీ కెనాల్ లో అర్చకుని మృతదేహం లభ్యం అయింది. అయితే ఆ రోజు కెనాల్ లో దిగేటప్పుడు ఆయన చేతిలో పట్టుకున్న అమ్మవారి విగ్రహం ఈరోజుకి అలాగే ఉంది. దీన్ని గమనించిన ప్రజలంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. 


ఇటీవలే నీళ్లలో పడి ఇద్దరు చిన్నారుల మృతి


పండగ పూట ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. దసరా సెలవుల్లో సరదా ఆడుకుంటుంటే కోతులకు భయపడి చిన్నారులు ప్రాణం మీదికి తెచ్చుకున్నారు. సరదాగా నలుగురు స్నేహితులు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కోతుల గుంపు రావటంతో భయపడిన చిన్నారులు పరుగులు తీశారు. వారిని కోతులు వెంబడించాయి.  


కోతులు వెంటబడడంతో..


నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడి పల్లిలో నలుగురు చిన్నారుల విషాదం తీవ్రoగా కలిచివేసింది. గ్రామంలో పండగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా ఆడుకుంటుండగా కోతులు రావటంతో చిన్నారులు భయపడ్డారు.  కోతుల భయంతో నలుగురు పరుగులు తీశారు. ఊరు చివరన ఉన్న చెరువులో నలుగురు చిన్నారులు దుకేశారు. నలుగురిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. గమనించిన గ్రామస్తులు ఇద్దరిని కాపాడారు. మరో ఇద్దరిని కాపాడే సమయానికి అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.


ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి..


వరంగల్‌ జిల్లాలోని ఉర్సుగుట్ట దగ్గర విషాదం జరిగింది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.  


హైదరాబాద్‌లోని మాదాపూర్ దూర్గం చెరువు కేబుల్ వంతెన పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 24 గంటలపాటు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ అబ్ధుల్లాపూర్‌మెట్‌కు చెందిన స్వప్న(23)కు సంవత్సరం క్రితం పెళ్లి జరిగింది. అయితే కొన్నాళ్లపాటు హాయిగా సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలు అయ్యాయి. దీంతో 8 నెలల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం పుట్టింటికి వెళ్లిపోయి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. 


భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటి నుంచి స్వప్న తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ఒత్తిడిని తట్టుకోలేక చాలా ఆస్పత్రుల్లో చికిత్స కూడా తీసుకుంది. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం దుర్గంచెరువు వద్దకు వెళ్లి కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్టీఆర్ఎఫ్ బృందం 24 గంటలపాటు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపారు.