టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత(Samantha). వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. ప్రస్తుతం తెలుగులో 'ఖుషి', 'యశోద'.. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది సమంత.
ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. 'సిటాడెల్'కు రీమేక్ గా ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు. రుస్సో బ్రదర్స్ ఇచ్చిన కథ ఆధారంగా స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్, డీకే ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ లో సమంత 'రా' ఏజెంట్ గా కనిపించబోతుందట. ఈ మధ్యకాలంలో మన స్టార్ హీరో, హీరోయిన్లు 'రా' ఏజెంట్స్ గా నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
రీసెంట్ గా సోనాల్ చౌహాన్ 'ది ఘోస్ట్' సినిమాలో 'రా' ఏజెంట్ గా కనిపించింది. నిజానికి ఈ పాత్ర కాజల్ చేయాల్సివుంది కానీ కుదరలేదు. ఇప్పుడు సమంత కూడా 'రా' ఏజెంట్ గా కనిపించబోతుంది. యాక్షన్ అడ్వెంచర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు ఉన్నాయట. అందులో సమంత నటించాల్సి ఉంది. అందుకే సమంత ప్రస్తుతం అమెరికాలో నిపుణుల సమక్షంలో తన పాత్ర కోసం ట్రైనింగ్ తీసుకుంది. భారీ బడ్జెట్ తో ఈ సిరీస్ ను నిర్మించనున్నారు. ఈ వెబ్ సిరీస్ మేకింగ్ లో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు.
90వ దశకంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. నవంబర్ లేదా డిసెంబర్ నుంచి దీనికి సంబంధించిన వర్క్ షాప్స్ లో సమంత పాల్గొనబోతుంది. 2023 టార్గెట్ గా పెట్టుకొని రాజ్ అండ్ డీకేలు వర్క్ చేస్తున్నారు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్ ఇదేనని చెబుతున్నారు. దీని ఒరిజినల్ అమెరికన్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా చేసిన పాత్రనే మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్చి సమంతను చూపించబోతున్నారు.
'శాకుంతలం' వాయిదా:
రీసెంట్ గా సమంత నటించిన 'శాకుంతలం' సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నవంబర్ 4న సినిమా రానుందని చెప్పారు. అయితే ఇప్పుడు చెప్పిన డేట్ కి రావడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాను వాయిదా వేసినట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు. దానికి కారణం.. ఈ సినిమాను త్రీడీ టెక్నాలజీలోకి మార్చడమే. ఇలాంటి సినిమాను త్రీడీలో చూపించడం కరెక్ట్ అని భావించిన టీమ్.. దానికోసం వర్క్ చేయడం మొదలుపెట్టారు. అందుకే సినిమా రిలీజ్ ఆలస్యమవుతుందని తెలుస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
తమ ప్రయత్నాన్ని భారీ ఎత్తున, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగు ప్రేక్షకులకు అందించడమే తమ లక్ష్యమని.. అందుకే 'శాకుంతలం' ఆలస్యమవుతుందని వెల్లడించారు మేకర్స్. ఇక ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా.. దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో డిఆర్‌పి, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై రూపొందుతోన్న 'శాకుంతలం' చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నీలిమా గుణ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Also Read : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?
Also Read : వేలెత్తి చూపిస్తూ, రక్తం అమ్ముకొని బతుకుతున్నానన్నారు - చిరు ఎమోషనల్ కామెంట్స్!