నిరుద్యోగ మహిళలకు మైక్రోసాఫ్ట్ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. వివిధ విభాగాల్లో మూడు నెలలపాటు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ కోఆర్డినేటర్ శ్రీధర్ ఒక ప్రటనలో తెలిపారు. ఉచిత ఉపాధి శిక్షణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ మహిళలకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్నవారు 18003098811, 9100810928 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.



శిక్షణ కోర్సులివే:
1) వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్
2) ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ 
3) ఐటీఈఎస్
4) స్పోకెన్ ఇంగ్లిష్
5) ఇంటర్వ్యూ స్కిల్క్స్
6) కెరియర్ గైడెన్స్
7) ఆన్‌‌జాబ్ ట్రైనింగ్ శిక్షణ 



Also Read: 


ఆర్టీసీలో అప్రెంటిస్‌ పోస్టులు, డిగ్రీ ఏదైనా సరే!
తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థలో (టీఎస్‌ఆర్టీసీ) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఇంజినీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్ అర్హత ఉన్న అభ్యర్థులు ఇంజినీరింగ్ విభాగానికి; బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ డిగ్రీ అర్హత ఉన్నవారు నాన్-ఇంజినీరింగ్ విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 16లోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మొదట నేషనల్ అప్రెంటిస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే వెబ్‌సైట్‌లో టీఎస్‌ఆర్టీసీని ఎంపిక చేసుకుని STLHDS000005 యూజర్‌ ఐడీ ద్వారా అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తు సమర్పించాలి. ప్రస్తుతానికి నాన్-ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను మాత్రమే అధికారులు విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రకటనలను త్వరలోనే విడుదల చేయనున్నారు.


వివరాలు..


* అప్రెంటిస్ పోస్టులు




 



1) నాన్-ఇంజినీరింగ్ ఖాళీలు: 150


2) ఇంజినీరింగ్ ఖాళీలు: ప్రకటించాల్సి ఉంది.


అప్రెంటిస్ వ్యవధి: 3 సంవత్సరాలు.


రీజియన్లవారీగా నాన్-ఇంజినీరింగ్ ఖాళీలు: హైదరాబాద్-26, సికింద్రాబాద్-18, మహబూబ్ నగర్-14, మెదక్-12, నల్లగొండ-12, రంగారెడ్డి-12, ఆదిలాబాద్-09, కరీంనగర్-15, ఖమ్మం-09, నిజామాబాద్-09, వరంగల్-01.


అర్హత: బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ డిగ్రీ అర్హత ఉండాలి. తెలంగాణ ప్రాంతానికి చెందినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.


వయోపరిమితి: 01.07.2022 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం:  మెరిట్ ఆధారంగా.


స్టైపెండ్: ఎంపికైన అభ్యర్థులకు మూడేళ్లపాటు స్టైపెండ్ అందజేస్తారు. మొదటి ఏడాది నెలకు రూ.15,000; రెండో ఏడాది నెలకు రూ.16,000, మూడో ఏడాది నెలకు రూ.17,000 చెల్లిస్తారు.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.10.2022.


దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


DOT: టెలికమ్యూనికేషన్ శాఖలో ఇంటర్న్‌షిప్, ఈ అర్హతలు ఉండాలి!
భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్‌లో ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.15000 ఇంటర్న్‌షిప్‌గా ఇస్తారు. ఇంటర్నిషిప్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు
TEC ఇంటర్న్‌షిప్ స్కీమ్ - ఇంటర్న్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...