సెల్ ఫోన్ వచ్చాక చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఫోన్ ఎక్కువగా వాడటం వలన కలిగే నష్టాలను కూడా చూస్తున్నాం. అయితే సెల్ ఫోన్ కోసం స్నేహితుడిని హత్య..లాంటి వార్తలు చూశాం. ఓ వ్యక్తి సెల్ ఫోన్ కోసం తన తండ్రినే చంపేశాడు. తనకు ఎన్నిసార్లు అడిగినా.. సెల్ ఫోన్ కొనివ్వట్లేదని.. తండ్రిని దారుణంగా చంపేశాడు ఓ తనయుడు.. వివరాల్లోకి వెళ్తే.. 


తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వానపల్లి పాలెంకు  చెందిన బొంతు రవి ఖాళీగా తిరిగుతాడు. ఎలాంటి పని చేయకుండా ఉంటాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తన తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని.. మద్యం తాగేవాడు.  తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. అయితే ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో తండ్రి బొంతు జయరావు(50) తో వాగ్వాదానికి దిగాడు. తనకు అర్జెంట్ గా సెల్ ఫోన్ కొని ఇవ్వాలని.. అందుకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. 


Also Read: RMP Doctor: ఒక్క ముద్దుకు రూ.25 వేలు, ఆస్పత్రి రెంట్ కూడా.. ఆర్ఎంపీ డాక్టర్‌కు ఆఫర్.. చివరికి..


సుమారు గంట సేపు తండ్రీ కొడుకుల మధ్య ఇదే వాగ్వాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే తండ్రి జయరావు నా దగ్గర డబ్బులు లేవు అని.. ఉన్నా ఇచ్చేది లేదని  చెప్పడంతో కోపోద్రిక్తుడైన రవి కత్తితో విచక్షణారహితంగా తండ్రిపై దాడి చేశాడు. రక్తపుమడుగులో పడి ఉన్న జయ రావును అమలాపురంలోని ఏరియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు స్థానికులు. తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో జయరావు మృతి చెందాడు.  


Also Read: Crime News: స్టూడెంట్ బుగ్గ కొరికిన హెడ్ మాస్టర్…స్కూల్లోనే ఉతికి ఆరేసిన తల్లిదండ్రులు


వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే బొంతు  జయరాజు కుటుంబాన్ని పోషిస్తుండగా మద్యానికి బానిసై కొడుకు రవి గాలి తిరుగుళ్ళు తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని అమలాపురం సీఐ సురేష్ బాబు ఎస్సై వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


 


Also Read: Crime News: గర్భం దాల్చిన మహిళ.. విషయం తెలిసి ఇద్దరు ప్రియుల ఫైటింగ్.. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే..


Also Read: AP Fiber Net Case: ఏపీ ఫైబర్ నెట్ కేసులో తొలి అరెస్టు... సాంబశివరావును అరెస్టు చేసిన సీఐడీ... హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు


Also Read: Rajasthna Crime News: రాజస్థాన్ లో దారుణ ఘటన... నలుగురు కుమార్తెలను హత్యచేసిన తండ్రి...