మరదలితో పెళ్లికి నిరాకరించారని దారుణానికి ఒడిగట్టాడో ఓ వ్యక్తి. తన నలుగురు కుమార్తెలను నీటి ట్యాంక్‌లో తోసేసి హత్య చేశాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నలుగురు చిన్నారులు పదేళ్లలోపు వారే. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని బాడ్మేర్లో చోటుచేసుకుంది. పోశాల గ్రామానికి చెందిన పుర్ఖారామ్‌కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కరోనా కారణంగా అతడి భార్య ఐదు నెలల క్రితం మృతి చెందింది. కుమార్తెల కోసం తల్లి అవసరమని భావించిన పుర్ఖారామ్ భార్య చెల్లిని ఇచ్చి వివాహం చేయాలని అత్తామామలను కోరాడు. కానీ మరదలను ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించలేదు.
Also Read: Whistiling village Kongthong: అక్కడ ఎవరినైనా విజిలేసి పిలుస్తారు... పేర్లు కూడా ఈల శబ్ధాలే...
పిల్లలకు విషం ఇచ్చి..
పెళ్లికి నిరాకరించడంతో మనస్తపానికి గురైన పుర్ఖారామ్... తన కుమార్తెలు జియో (9), నోజి (7), హీనా (3), లాసి (ఏడాదిన్నర)లతో విషం తాగించాడు. అనంతరం వారిని తన ఇంటి ముందు 13 అడుగుల లోతున్న నీటి ట్యాంక్‌లో తోసేశాడు. తర్వాత పుర్ఖారామ్ కూడా అందులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడు వాటర్ ట్యాంక్‌లోకి దూకుతున్నప్పుడు పక్కింటి వారు గమనించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు అధికారి ఓం ప్రకాశ్ ఈ ఘటనపై వివరాలు తెలిపారు. నలుగురు పిల్లలను నీటిలో తోసేయగా వారు నీటిలో మునిగిపోయి చనిపోయారు. మృతదేహాలను ట్యాంక్ నుంచి బయటకు తీసి సమీపంలోని మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రాణాలతో బయటపడ్డ పుర్ఖారామ్‌ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
భార్య చనిపోవడంతో..
ఈ కేసుకు సంబంధించిన కుటుంబసభ్యులను విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పుర్ఖారామ్ అత్తమామలను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. వారి స్టేట్‌మెంట్‌లు తీసుకుంటామన్నారు. నిందితుడి పరిస్థితిని మెరుగుపరచడంపై అతని వాంగ్మూలం కూడా నమోదు చేస్తామన్నారు. కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజుల క్రితం భార్య చనిపోవడంతో పుర్ఖారామ్ షాక్‌కు గురయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులే ఈ విషాద సంఘటనకు దారితీసిందంటున్నారు.
Also Read: Tamil Nadu: వాననీటిలో చిక్కుకున్న కారు.. వైద్యురాలి మృతి.. తమిళనాడులో దారుణం..
Also Read: Case On TDP Leaders: చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే దాడి.. 11 మంది టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు