Raj Kundra Adult Film Rocket Case: ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై అశ్లీల చిత్రాల కేసు విచారణను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాస్టింగ్ డైరెక్టర్‌తో సహా నలుగురిని వెర్సోవా, బోరివాలీ ఏరియాలో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం జాతీయ మీడియా ఏఎన్ఐ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీసేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


ఈ ఏడాది జూలైలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల చిత్రీకరణ కేసులో ముంబై పోలీసులు (Mumbai Police Crime Branch) అరెస్ట్ చేశారు. దాదాపు రెండు నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత గానీ ఆయనకు బెయిల్ రాలేదు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అజ్ఞాతవాసం గడిపారు. పబ్లిక్‌లోకి  రావడానికి అంత ఆసక్తి చూపని రాజ్ కుంద్రా, సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉన్నారు. అంతటితో ఆగకుండా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన అకౌంట్స్‌ను శాశ్వ‌తంగా డిలీట్ చేశారు. 






రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిపై సంచలన ఆరోపణలు..
వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై అశ్లీల చిత్రాల కేసు నమోదు అయిన తర్వాత ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు సైతం తమ విచారణలో కుంద్రా ఇంటి నుంచి కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. నటి గెహనా వశిష్ఠ కుంద్రా, శిల్పాశెట్టి దంపతులకు మద్దతు తెలిపారు. తాను ఎలాంటి వీడియోలు చేయలేదని, నన్ను ఎవరూ బలవంతం చేయలేదని చెప్పడం రాజ్ కుంద్రాకు ఊరటనిచ్చింది. హాట్ బాంబ్ షెర్లిన్ చోప్రా మాత్రం రాజ్ కుంద్రాతో పాటు  ఆయన భార్య శిల్పా శెట్టిపై సంచలన ఆరోపణలు చేశారు. రాజ్ కుంద్రా తనను లైంగికంగా, మానసికంగా వేధించారని షెర్లిన్ చోప్రా ఆరోపించారు. 


అండర్ వరల్డ్‌తో తనకు సంబంధాలు ఉన్నాయని తనను రాజ్ కుంద్రా బెదిరించారని షెర్లిన్ సంచలన ఆరోపణలు చేశారు. తమపై ఉద్దేశపూర్వకంగా పరువు నష్టం వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ షెర్లిన్ చోప్రాకు రూ.50 లక్షల పరువు నష్టం నోటీసులు పంపారు. దీనికి షెర్లిన్ సైతం ఘాటుగానే బదులిచ్చారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే వ్యక్తిని కాదని చెబుతూ తనను మానసికంగా కూడా వేధించినందుకు రూ.70 కోట్లు పరిహారం చెల్లించాలంటూ తిరిగి నోటీసులు పంపినట్లు గతంలో స్వయంగా ఆమె వెల్లడించారు. తన ఫిర్యాదు మేరకు రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులపై పోలీసులు కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని కోరారు.


భర్తపై నమోదైన అశ్లీల వీడియోల కేసు శిల్పాశెట్టిపై ప్రభావం చూపింది. కొన్ని రోజులు ఆమె షూటింగ్ లకు వెళ్లలేదు. ఇంటి నుంచి బయటకు రాకుండా మానసిక వేధనకు గురయ్యారు. భర్తతో శిల్పా శెట్టి విడాకులు తీసుకుంటారని సైతం ప్రచారం జరిగింది. అయితే అవన్నీ వదంతులేనని ఈ జంట క్లారిటీ ఇచ్చింది. తన భర్త రాజ్ కుంద్రాకు శిల్పాశెట్టి మద్దతుగా నిలిచారు. ఆయన ఏ తప్పు చేయలేదని కొన్ని రోజుల తరువాత వ్యాఖ్యానించారు.


Also Read: Raj Kundra Case: అటెన్షన్ కోసం నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు.. శిల్పాశెట్టి రియాక్షన్ 


Also Read: Trivikram Vs Bandla Ganesh: వైసీపీతో త్రివిక్రమ్ ప్లాన్? అందుకే, 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్‌కు బండ్ల గణేష్ దూరమా? లీక్డ్ ఫోన్ కాల్‌లో నిజమెంత?