CBSE Class 10th Term 1 Result 2022: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి, ప్లస్ 2 తరగతుల పరీక్షా ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది. అయితే ఈ వారమే సీబీఎస్ఈ 10, 12వ తరగతి టర్మ్ 1 పరీక్షల ఫలితాలు రానున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో సెంట్రల్ బోర్డ్ విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత రెండేళ్లుగా కరోనా వ్యాప్తి కారణంగా చదువులు సరిగా సాగడం లేదు. ఈ విద్యా సంవత్సరం సైతం సెకండ్ వేవ్ ప్రభావంతో కాస్త ఆలస్యమైంది. అయినప్పటికీ సీబీఎస్ఈ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షల్ని నిర్వహిచింది. టర్మ్ 1, టర్మ్ 2 గా పరీక్షలు నిర్వహించాలని ప్లాన్ చేసింది. కరోనా నేపథ్యంలో స్కూలు, కాలేజీలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో సెలబస్ కొంతమేర తగ్గించారు. CBSE 10, 12 తరగతుల టర్మ్ 1 పరీక్ష ఫలితాల (CBSE Term1 Result 2022)ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలు విడుదలైతే అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in లో చెక్ చేసుకోవాలని బోర్డు అధికారులు సూచించారు.
బోర్డు అధికారులు ఏమన్నారంటే..
కొన్ని మీడియాలో ఫలితాలు విడదులయ్యాయని కథనాలు వస్తున్నాయని, ఇప్పటివరకూ సీబీఎస్ఈ టర్మ్ 1 ఫలితాలు రిలీజ్ చేయలేదని బోర్డుకు చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. ఫలితాలు చూసుకునేందుకు విద్యార్థులు తమ రోల్ నంబర్‌తో పాటు స్కూల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే ఫలితాలు విడుదల చేస్తామని సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ ఫిబ్రవరి 9న చెప్పారు. అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలు విడుదల చేస్తామని, సోషల్ మీడియా కథనాలు నమ్మవద్దని పేర్కొన్నారు. ఒకవేళ ఫలితాలు విడుదలైతే కింద తెలిపిన విధంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. Direct Link To Check CBSE Class 10th, Class 12th Term 1 2022 Result
సీబీఎస్ఈ 10, 12 క్లాసుల రిజల్ట్స్ ఇలా తెలుసుకోవాలి.. ..
STEP 1: మొదట అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in కి వెళ్లండి
STEP 2: ఫలితాలు అని కనిపించే Results మీద క్లిక్ ఇవ్వండి.
STEP 3: విద్యార్థులు తమ రోల్ నంబర్, వివరాలను నమోదు చేయాలి
STEP 4: ఆపై సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయగా మీ స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి.
STEP 5: విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోవాలి.
Also Read: SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్‌న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Also Read: 4-Day Working Week: ఆ దేశంలో ఇక నాలుగు రోజులే పని.. 3 రోజులు వీకెండ్ హాలీడేస్!