శేషాచలం కొండల్లో పుష్ప సినిమా దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. శ్రీవారి భక్తులు నడిచే దారుల్లోనే ఎర్రచందనం దుంగలు కొట్టేసి కొట్టుకెళ్లిపోతున్నారు. ఇలా ఎన్నితీసుకెళ్తున్నారో కానీ కొన్ని కొన్నిచోట్ల మాత్రం దొరికిపోతున్నారు. గురువారం తిరుపతి నుంచి తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో వినాయకుని ఆలయం వద్ద అచ్చంగా పుష్ప సినిమాలో సన్నివేశమే ఆవిష్కృతమయింది.


Also Read: తనిఖీల పేరుతో అసభ్యకర చర్యలు... పరీక్షలు బహిష్కరించిన విద్యార్థులు


తిరుమల ఘాట్‌రోడ్‌ ప్రాంత అడవిలో  ఎర్రచందనం స్మగ్లర్లు చొరబడ్డారన్న సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిచారు.  తిరుమల ఘాట్ రోడ్డు పరిధిలో కూంబింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ తారసపడ్డారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసుల్ని చూసిన స్మగ్లర్లు ఎదురుదాడికి ప్రయత్నించారు. కానీ పోలీసులు  అన్ని విధాలుగా రెడీగా ఉండటంతో స్మగ్లర్లను చుట్టు ముట్టారు. దీంతో  దొంగలు... దుంగల్ని అక్కడే పడేసి అడవిలోకి  పరారయ్యారు. 


Also Read: Hyderabad: మీరు అపార్ట్‌మెంట్లలో ఉంటారా? ఈ సౌకర్యం ఫ్రీగా పొందండి.. ఇంకా రెండు రోజులే ఛాన్స్


ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.  దుంగలు అక్కడే పడేసి కేకలు వేస్తూ చీకటిలో కలిసి పోయారు. ఆరవ కల్వర్టు పడమర వైపున 23 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి.  ఈ దుంగలు 699 కిలోలు ఉన్నాయి. వాటి విలువ దాదాపు 40 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.




Also Read: Nizamabad: హైవేపై కుప్పలుతెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు కలకలం.. అవాక్కయిన స్థానికులు, ఏం జరిగిందంటే..



శేషాచలం అడవుల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం సంపదను స్మగ్లర్లు దోచుకెళ్తున్నారు.  డాన్‌లు పెద్ద ఎత్తున కూలీల్ని పెట్టుకుని మరీ చెట్లను నరికి తీసుకెళ్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎంత కఠినమైన నిఘా పెట్టినా స్మగ్లర్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.  ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించడానికి ప్రత్యేకంగా టాస్క్ పోర్స్ చర్యలు తీసుకుంటోంది. అడవుల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయినా స్మగ్లర్లు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో అత్యంత విలువైన సంపద... స్మగ్లర్ల పాలవుతోంది. 


Also Read: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి