Kanjhawala Delhi Case:


ఎందుకు పరారయ్యారు..?
 
ఢిల్లీలోని కంజావాలా కేసు మరో మలుపు తిరిగింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే...ఇంకా కొన్ని విషయాల్లో స్పష్టత రావడం లేదు.  అందుకే...పోలీసులు ఆ నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని భావిస్తున్నారు. యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడి నుంచి ఎందుకు పరారయ్యారు..? ఇది కావాలనే చేశారా..? ఇనే నిజా నిజాలు బయటకు రావాలంటే..ఈ టెస్ట్ తప్పదని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే...యాక్సిడెంట్ చేశాక కూడా అసలేమీ జరగనట్టుగా తిరిగారు నిందితులు. అంతే కాదు. కార్‌ ఓనర్‌కు ఆ కార్‌ని తిరిగి ఇవ్వలేదు కూడా. "అంత రాత్రి పూట నిద్ర లేపి కార్‌ ఇవ్వడం ఎందుకని ఆగిపోయాం" అని నిందితులు విచారణలో చెప్పినప్పటికీ పోలీసుల అనుమానం తీరలేదు.


టైమ్ మిస్‌మ్యాచ్..


ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా చూస్తే...అంజలి (మృతురాలు) ముందువైపు ఎడమ చక్రంలో ఇరుక్కుపోయింది. ఆమె రక్తపు మరకలు కూడా ఆ వీల్‌కే ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కార్ కింద భాగంలోనూ రక్తపు మరకలున్నట్టు ఫోరెన్సిక్ రిపోర్ట్ వెల్లడించింది. అయితే... అంజలికి,ఆమె బాయ్‌ఫ్రెండ్‌కి ఈ యాక్సిడెంట్‌కు ముందు ఓ హోటల్‌లో  వాగ్వాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలుసుకున్నారు పోలీసులు. అంజలి ఫ్రెండ్ నిధి కూడా ఈ విషయం చెప్పింది. పైగా...వాళ్లిద్దరి మధ్య జరిగిన ఘర్షణలోనే అంజలి ఫోన్‌ కింద పడి పగిలి పోయిందని కూడా వివరించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే...సీసీటీవీ ఫుటేజ్‌ మిస్ మ్యాచ్ అవుతోంది. నిధి ఇంటి వద్ద సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన విజువల్స్ ప్రకారం చూస్తే...ఆమె తన ఇంటికి తిరిగి వచ్చిన టైమ్ 1.36 AM. కానీ...పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే...ఆ సీసీటీవీ DVR 45-50 నిముషాలు లేట్‌గా నడుస్తోందని. ఇక నిధి, అంజలి హోటల్ నుంచి బయటకు వచ్చిన టైమ్‌ని సీసీటీవీలో చూస్తే 1.32AM. కానీ...ఇక్కడ కూడా CCTV 15 నిముషాలు ఆలస్యంగా నడుస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. ఫలితంగా..ఈ "టైమింగ్స్‌" మిస్‌మ్యాచ్ అవుతున్నాయి. 


దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తోంది.






ఎవరు వాళ్లు..? 


ఇక పోలీసులు చెప్పిన మరో విషయం ఏంటంటే...కార్‌లో ఉన్న 5గురితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరి కొందరిని కూడా అదుపులోకి తీసుకున్నామని. కానీ...వారెవరు అన్న వివరాలు వెల్లడించలేదు. వాళ్లెవరు..? ఈ కేసుతో వాళ్లకున్న సంబంధం ఏంటి..? వాళ్లు నిధికి తెలిసిన వాళ్లా..? లేదంటే అంజలికి పరిచయస్థులా..? ఇలా ఎన్నో సందేహాలు కేసుని సంక్లిష్టం చేస్తున్నాయి. 


Also Read: Delhi Girl Attacked: బ్రేకప్ చెప్పినందుకు రెచ్చిపోయిన యువకుడు, యువతిపై కత్తితో దాడి