ఫిబ్రవరి 17... సంక్రాంతి సీజన్ తర్వాత తెలుగు చిత్రసీమలో ట్రేడ్ వర్గాలను ఎక్కువ ఆకర్షిస్తున్న తేదీ! ఎందుకంటే... 18న మహాశివరాత్రి. ఫెస్టివల్ మూడ్ ఉంటుంది కనుక జనాలు ఎక్కువమంది థియేటర్లకు వస్తారని ఓ అంచనా. ఆల్రెడీ ఆ తేదీ మీద నాలుగు సినిమాలు కర్ఛీఫ్‌లు వేశాయి. అయితే, అసలు పోటీ రెండు సినిమాల మధ్య ఉండేలా కనిపిస్తోంది.


సమంత 'శాకుంతలం' వర్సెస్ ధనుష్ 'సార్'
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన దృశ్యకావ్యం 'శాకుంతలం'. ఈ సినిమా నిర్మాణంలో 'దిల్' రాజు కూడా భాగస్వామి. దీనిని ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సినిమా కంటే ముందు ఆ తేదీకి తమ తమ సినిమాలను తీసుకు రానున్నట్లు ధనుష్ 'సార్', విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ', కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా యూనిట్స్ వెల్లడించాయి.
 
యువ ప్రేక్షకుల్లో విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరానికి క్రేజ్ ఉంది. అయితే, వాళ్ళ ఇద్దరి సినిమాలు తెలుగులో మాత్రమే విడుదల కానున్నాయి. పైగా, ధనుష్ & సమంతకు వాళ్ళు పోటీ ఏమీ కాదు. అసలు పోటీ సమంత 'శాకుంతలం', ధనుష్ 'సార్' మధ్యే ఉంటుందని చెప్పవచ్చు. రెండూ పెద్ద సినిమాలు. స్టార్లు ఉన్న సినిమాలు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న సినిమాలు.


సమంత 'శాకుంతలం' సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్, 'యశోద'తో దేశ వ్యాప్తంగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. హిందీ, మలయాళ భాషల్లో క్రేజ్ ఎలా ఉందనేది పక్కన పెడితే... తమిళంలో కూడా సమంత స్టార్ హీరోయిన్. అక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల, ధనుష్ 'సార్'కు 'శాకుంతలం'కు మధ్య పోటీ ఉంటుంది. తెలుగులో ధనుష్ 'సార్' కంటే సమంత సినిమాకు ఎక్కువ క్రేజ్ ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
 
సమంత, ధనుష్ మధ్య పోటీనా?
'దిల్' రాజు, నాగ వంశీ మధ్య పోటీనా?
సమంత 'శాకుంతలం', ధనుష్ 'సార్' సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి వస్తుంటే... ఆ రెండు సినిమాల మధ్య పోటీగా కొందరు చూడటం లేదు. నిర్మాతలు 'దిల్' రాజు, సూర్యదేవర నాగవంశీ మధ్య పోటీగా ఇండస్ట్రీ జనాల్లో కొందరు చూస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'దిల్' రాజు చేసిన వ్యాఖ్యలే.


'దిల్' రాజుకు తన సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వవొద్దని మహేష్ బాబు చెప్పినట్టు వార్తలు రాగా... 'సార్' నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడన్నట్టు 'దిల్' రాజు చెప్పుకొచ్చారు. ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తే తనకు ఇవ్వరా? అని ప్రశ్నించారు. సితార మాతృసంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మీద నిర్మించిన 'అజ్ఞాతవాసి'కి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చానని, ఆ సినిమా పంపిణీలో తనకు లాస్ వచ్చిందని వెల్లడించారు. ఇప్పుడు ఆ సంస్థ నుంచి వస్తున్న 'సార్'కు పోటీగా 'శాకుంతలం' విడుదల చేయడం వెనుక ఆ గొడవలు ఏమైనా ఉన్నాయా? అనేది కొందరి సందేహం. ఒకవేళ 'సార్‌' సినిమాను 'దిల్‌' రాజు విడుదల చేసినా ఆశ్చరపోనవసరం లేదు. ఆయన డిస్టిబ్యూట్‌ చేసినా... సమంత సినిమా వస్తే 'సార్‌'కు డ్యామేజ్‌ జరుగుతుందని ట్రేడ్‌ టాక్‌. ఎందుకంటే...


Also Read : 'దిల్' రాజు ఒక్కడూ ఒకవైపు - బడా నిర్మాతలు మరోవైపు?


విద్యావ్యవస్థ నేపథ్యంలో ధనుష్ 'సార్' రూపొందింది. దానితో పోలిస్తే...  సమంత 'శాకుంతలం'కు ఎక్కువ ఎడ్జ్ ఉంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. 'బాహుబలి' తర్వాత అటువంటి కాస్ట్యూమ్ డ్రామాలకు క్రేజ్ ఏర్పడింది. తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' గానీ, హిందీలో ఫ్లాప్ అయినా ఆమిర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్', అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' వంటి సినిమాలు వచ్చినా కారణం బాహుబలే. అందులోనూ సమంత అనారోగ్యం బారిన పడటం వల్ల ఆమెపై సింపతీ క్రియేట్ అయ్యింది. దానికి తోడు 'శాకుంతలం' స్టోరీ కాన్సెప్ట్ అట్ట్రాక్ట్ చేస్తుంది. దుష్యంతుడు, శాకుంతల కథను తెరపై ఎలా చూపించి ఉంటారనే క్యూరియాసిటీ ఉంది. 


Also Read : టాలీవుడ్‌లో విషాదం, 2023లో తొలి మరణం - చిరంజీవి సినిమాలో 'సిగ్గుతో ఛీ ఛీ...' పాట రాసిన పెద్దాడ మూర్తి మృతి