ABP  WhatsApp

Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!

ABP Desam Updated at: 27 May 2022 06:25 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు ఇస్తానని చెప్పి యువతిని ఇంట్లో బంధించి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లాట్ అండ్ ప్లాట్ మేట్ అనే గ్రూప్ ద్వారా యువతులను ట్రాప్ చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తుంది.

ఇళ్లు చూపిస్తానని యువతిపై అత్యాచారయత్నం

NEXT PREV

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిని ఇళ్లు రెంటుకి ఇస్తానని తీసుకెళ్లి ఆ ఇంట్లోనే బంధించి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడిని ప్రతిఘటించిన యువతి గట్టిగా కేకలు వేసింది. అరిస్తే రేప్ చేస్తానంటూ కింగ్ ఖాన్ హమీద్ అనే యువకుడు మహిళను బెదిరించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి చదర్ ఘాట్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో 354A, 354b, 342,323 IPC కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. యువతికి ఇళ్లు చూపించేందుకు ఈ నెల 18న ఒవైసీ ఆసుపత్రి దగ్గరకు రావాలని పిలిపించి, అక్కడ నుంచి ఆమెను అక్బర్ బాగ్ తీసుకెళ్లాడు హమీద్. ఇంటికి వెళ్లాక సెల్ ఫోన్ తీసుకుని, యువతిపై అత్యాచారయత్నం చేయబోయాడు. ప్లాట్ మేట్ అనే గ్రూప్ ద్వారా యువతి నెంబర్ సేకరించి చాట్ మొదలు పెట్టాడు యువకుడు. చాలా మంది అమ్మాయిలను ఇళ్లు రెంట్ పేరుతో అఘాయిత్యాలు చేస్తున్నారని, ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలని బాధితురాలు పోలీసులను వేడుకుంది. 



(నిందితుడు హమీద్)


సెల్ఫీ వీడియో వైరల్ 



ప్లాట్ అండ్ ప్లాట్ మేట్ అనే వాట్సాప్ గ్రూప్ నుంచి నా మేసేజ్ వచ్చింది. ఇళ్లు రెంట్ కు చూపిస్తామన్నారు. కామినేని ఆసుపత్రి నాగోల్ సైడ్ ఇళ్లు చూసుకుని వచ్చాను. అతనికి కాల్ చేస్తే ఓవైసీ ఆసుపత్రి సైడ్ రావాలన్నాడు. నాకు లోకేషన్ కూడా తెలియదన్నాను. అతనే వచ్చి నన్ను తీసుకెళ్లాడు. ఇళ్లు చూపిస్తానని చెప్పాడు. తన పేరు హమీద్. అక్బర్ బాగ్ లో ఉంటున్నాడు. అక్కడికి తీసుకెళ్లి ఇళ్లు చూపించాడు. ఇంట్లోకి వెళ్లగానే నా ఫోన్ లాక్కున్నాడు. ఇళ్లు తలుపు మూసేశాడు. నన్ను కొట్టి, చంపుతానని చెప్పి నాపై అత్యాచారం చేశాడు. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. చాలా మంది బయటకు రావడంలేదు. హమీద్ అనే వ్యక్తికి శిక్షపడేలా చేయండి. తనకు రాజకీయ నాయకులు నుంచి సపోర్ట్ ఉందని తెలుస్తోంది. ఇది రెంటల్ గ్రూప్ కాదు. ఏదో పెద్ద స్కామ్. అమ్మాయిలను ట్రాప్ చేసే గ్రూప్ లా ఉంది. ఈ ఘటనపై మహిళ సెల్ఫీ వీడియో విడుదల చేసింది.  - బాధితురాలు


Also Read : Honor Killing In Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం- మతాంతర వివాహం చేసుకుందని కుమార్తె గొంతు కోసి హత్య చేసిన తండ్రి


Also Read : Manjusha Neogi Death: కోల్‌కతాలో మరో మోడల్ మృతి- 2 వారాల్లో మూడో ఘటన!

Published at: 27 May 2022 06:22 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.