Manjusha Neogi Death: కోల్‌కతాలో మోడల్స్ వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. గురువారం మరో మోడల్ మృతి చెందింది. పటౌలీ ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న ఆ మోడల్‌ను మంజుషా నియోగిగా గుర్తించారు.
15 రోజుల్లో
గడిచిన 15 రోజుల్లో కోల్‌కతాలో ఇద్దరు మోడళ్లు చనిపోయారు. అయితే ఆమె స్నేహితురాలు, మోడల్ అయిన బిదిషా డీ మజుందార్ రెండు రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో చనిపోయింది.
ఫ్రెండ్ మృతితో మంజుషా డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఆమె తల్లి తెలిపారు. దీంతో మంజుషా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని వెనుక వేరే కారణం కూడా ఉన్నట్లు తాజాగా తేలింది.
ఇదే కారణం
మంజుషా, బిదిషా కలిసి జీవించాలనుకున్నారట. ఆ ప్రతిపాదనను తన ముందు ఉంచినప్పుడు మంజుషాను తీవ్రంగా మందలించినట్లు ఆమె తల్లి తెలిపారు. అయితే ఇలా పలుమార్లు ఈ విషయంలో గొడవ కూడా జరిగిందట. బిదిషాతో మంజుషా నిత్యం ఫోన్‌లో మాట్లాడేదని ఆమె తల్లి చెప్పారు. బిదిషా ఆత్మహత్యతో మంజుషా తీవ్ర ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తెలిపారు.
దుందుం ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో బ్రైడల్ మేకప్ ఫోటో షూట్స్ చేసే బిదిషా మజుందార్ కూడా ఉరి వేసుకుంది. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని బిదిషా సూసైడ్ నోట్‌లో పేర్కొంది. అవకాశాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు వారాల క్రితం మరో పాపులర్ టీవీ నటి పల్లబి దేవ్ కూడా తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. దీంతో మోడల్స్ వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Cruise Ship Drugs Case: ముంబయి డ్రగ్స్ కేసులో షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్!