ఈ మధ్య విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే చాలా ఘటనల్లో సాంకేతిక సమస్యల కన్నా పైలట్ల నిర్లక్ష్యమే ఎక్కువని దర్యాప్తులో తేలింది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి బయటికి వచ్చింది. ఇందులో ఏకంగా పైలట్ కాక్‌పిట్‌లోనే ట్రైనీ మహిళతో రొమాన్స్ చేసేశాడు. విమానం గాల్లో ఉండగానే అంతా కానిచ్చేశాడు. పైగా ఈ మొత్తం వీడియో కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో బయటికి రావడంతో అంతా అవాక్కయ్యారు. ఆ పైలట్ సహా ట్రైనీని సస్పెండ్ చేశారు.






ఇదీ జరిగింది


రష్యాలోని సాసోవో ఫ్లైట్ స్కూల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో ఈ సంఘటన వెలుగు చూసింది. 28 ఏళ్ల పైలట్‌ కొందరు ట్రైనీలకు శిక్షణ ఇస్తున్నాడు. రియాజాన్ ప్రాంతంలో సెస్నా 172 విమానంలో ఒక మహిళా ట్రైనీకి శిక్షణ ఇస్తూ ఎక్స్‌ట్రా క్లాసులు ఇస్తానని అందుకు బదులుగా తన కోరిక తీర్చాలని అడిగాడు. దీనికి ఆమె ఓకే చెప్పడంతో విమానాన్ని ఆటో పైలట్‌ మోడ్‌లో ఉంచి ఆ మహిళతో శృంగారం జరిపాడు. దీనిని మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేశాడు.


ఇలా బయటికి


అయితే ఆ ట్రైనీ పైలట్‌ తన స్నేహితురాలితో గొడవ పడడంతో ఆమె కోపంలో ఈ వీడియోను లీక్‌ చేసేసింది. వీడియో బయటకు రాగానే సంబంధిత ఫ్లయింగ్‌ స్కూల్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇద్దరినీ స్కూలు నుంచి బహిష్కరించాయి.  


దీనిపై ట్రైనీ పైలట్‌ను ప్రశ్నించగా తాము శృంగారంలో పాల్గొనలేదని, ముద్దులు, కౌగిలింతలకే పరిమితమయ్యామని తొలుత చెప్పింది. వీడియో బయటపడ్డాక అది ఒక్కసారే జరిగిందని, మరెప్పుడూ తాము అలా చేయలేదని వివరణ ఇచ్చింది.


అలాగే ఆ పైలట్ వివాహితుడు కావడంతో శృంగారాన్ని రికార్డు చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఎక్స్‌ట్రా క్లాసులు చెబుతానని ఆ పైలట్‌ హామీ ఇవ్వడంతో దానికి ఆమె ఒప్పుకున్నట్లు ఫ్లయింగ్ స్కూల్ వర్గాలు తెలిపాయి. 


Also Read: IAS officer transferre: కుక్కతో వాకింగ్‌పై కేంద్రం సీరియస్- ఒకర్ని లద్దాఖ్, మరొకర్ని అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ!


Also Read: Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి