హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్వాల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లో వ్యవధిలోనే మంటలు గోదాం మొత్తం వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలముకున్నాయి. గోదాంలో భారీ శబ్దాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి.


Also Read: Watch Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో... ఈ బైక్ రైడర్ ఎంత అదృష్ట వంతుడో చూడండి... తలపై నుంచి ట్రాక్టర్ టైరు వెళ్లింది




గోదాం నుంచి పెద్ద శబ్దాలు


పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీలోని స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ప్రజలు పోలీసులకి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గోదాం లోపలికి పోయే దారిలేకపోవడంతో జేసీబీ లతో గోడలు కూల్చివేశారు. గోదాంలో ఎలాంటి నిల్వ ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు గోదాంలో కుర్కురే సరకు ఉందని స్థానికులు అంటున్నారు. అయితే గోదాం నుంచి పెద్ద శబ్దాలు వస్తుండటంతో ఇంకేమైనా కెమికల్ లాంటి పదార్థాలు ఉన్నాయా అని పోలీసులు భావిస్తున్నారు.  


Also Read: Telangana Liberation Day: ఆపరేషన్ పోలో అంటే ఏంటి? హైదరాబాద్ విలీనానికి ముందు 5 రోజులు ఏం జరిగింది?



Also Read: Warangal: రేప్ కేసు నిందితుడు రాజు అంత్యక్రియలు పూర్తి.. ఊళ్లోకి రానివ్వని గ్రామస్థులు, చివరికి..


బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు


పశ్చిమగోదావరిజిల్లాలో వీరవాసరం మండలం రాయకుదురులో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో అనధికారకంగా తయారుచేస్తున్న బాణాసంచా పేలింది. దీపావళి దగ్గర పడుతుండటంతో గ్రామాల్లో నిబంధనలకు విరుద్దంగా ఇళ్లలోనే బాణాసంచా తయారుచేస్తున్నారు. రాయకుదురులో జరిగిన పేలుడుతో భారీ ఆస్తినష్టం జరిగింది. పేలుడు దాటికి బాణాసంచా తయారుచేస్తున్న ఇంటితో పాటు చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పేలుడు సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేశారు. 


Also Read: Allahabad HC: మతంతో సంబంధం లేకుండా జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు వారికి ఉంటుంది.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్య