రాష్ట్ర స్థాయిలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్‌ (ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించే ఈ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఐసెట్ కన్వీనర్‌ ప్రొఫెసర్ జి.శశిభూషణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీతో పాటు హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు ఉంటుంది. 


ఏపీ ఐసెట్ పరీక్ష ప్రాథమిక 'కీ'ని ఈ నెల 20వ తేదీన విడుదల చేస్తారు. 'కీ' మీద అభ్యంతరాలు ఉండే స్వీకరిస్తామని నోటిఫికేషన్లో తెలిపారు. ఈ నెల 22న సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు 'కీ'పై అభ్యంతరాలను పంపవచ్చని ఆంధ్రా యూనివర్సిటీ పేర్కొంది. ఏపీ ఐసెట్ ఫలితాలు ఈ నెల 30వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది. అడ్మిట్ కార్డు లేకపోతే అభ్యర్థులను పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేసింది. నిమిషం నిబంధన అమలులో ఉన్న నేపథ్యంలో విద్యార్థులంతా పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది.  


పరీక్ష విధానం.. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య మండలి తరఫున విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్ పరీక్షను నిర్వహిస్తోంది. ఐసెట్ పరీక్ష వ్యవధి 150 నిమిషాలుగా ఉంది. మొత్తం 3 సెక్షన్లలో ప్రశ్నలు ఉంటాయి. ఎనలటికల్ ఎబులిటీ, కమ్యూనికేషన్ ఎబులిటీ, మాథమెటికల్ ఎబులిటీ అనే మూడు సెక్షన్లలో మొత్తం 200 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. 


ఏపీ ఐసెట్ 2021 హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండిలా..



  • ఏపీ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.inను ఓపెన్ చేయండి.

  • ఏపీ ఐసెట్ ఆప్షన్ ఎంచుకోండి. 

  • ఇందులో డౌన్‌లోడ్ హాల్ టికెట్ అనే దానిని క్లిక్ చేయండి. 

  • రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేసి, డౌన్‌లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. 

  • భవిష్యత్ అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకోండి. 


Also Read: AP PGCET 2021: ఏపీ పీజీసెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?


Also Read: IIT Admissions: ఆర్ట్స్, కామర్స్ వాళ్లు కూడా ఐఐటీల్లో చేరవచ్చు.. ఎలా అంటే?