తెలంగాణలో ఆరేళ్ల బాలికలపై హత్యాచారం జరిగిన ఘటన సంచలనమైంది. చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. నాలుగేళ్ల కింద జరిగిన ఇలాంటి ఘటనలో స్థానిక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సైదాబాద్​లో ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. నిందితుడిని ఎన్​కౌంటర్​ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. కానీ నిందితుడి ఆత్మహత్యతో ప్రజాగ్రహం చల్లారింది. ఇదే తరుణంలో అందుకు భిన్నంగా ఓ బాలునికి జరిగిన మరో ఘటనలో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. 


Also Read: Watch Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో... ఈ బైక్ రైడర్ ఎంత అదృష్ట వంతుడో చూడండి... తలపై నుంచి ట్రాక్టర్ టైరు వెళ్లింది


బాలుడి ఒంటిపై సిగరెట్ తో కాల్చి


హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాలుడిపై లైంగిక వేధింపుల కేసులో శిక్ష ఖరారైంది. బార్కాస్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జ్యోతి అనే పాతికేళ్ల మహిళ 2017లో ఆయా పనిచేశారు. ఆ ఏడాది నవంబర్ 20న ఓ బాలుడు మూత్రశాలకు వెళ్లిన సమయంలో వెనుకే వెళ్లిన జ్యోతి బాలుడి మర్మాంగాలు పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించింది. అదే నెల 30న జ్యోతి మరోసారి బాలుడ్ని వేధించింది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని బాలుడిని బెదిరించింది. బాలుడి ఒంటిపై సిగరెట్​తో కాల్చింది. బాలుడి శరీరంపై సిగరెట్ వాతలను గమనించిన తండ్రి వాకబు చేశాడు. 


Also Read: Hyderabad Fire Accident: పెద్దఅంబర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం.. గోదాం నుంచి ఎగిసిపడుతున్న మంటలు... ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం


2017లో కేసు


బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాడు. ఈ ఘటనపై బాలుడి తండ్రి 2017 డిసెంబర్‌లో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. అనంతరం కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు. సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన కోర్టు నాలుగేళ్ల విచారణ తర్వాత తుది తీర్పు ఇచ్చింది. ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. 


Also Read: Chandra Babu House : చంద్రబాబు ఇంటిపై దాడికి వైసీపీ కార్యకర్తల యత్నం..! ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత !


Also Read: Early Elections : తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు ఖాయమా ? అధికార పార్టీల కసరత్తు అదే చెబుతోందా ?