గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన సైదాబి అనే రైతుపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సైదాబి తీవ్రంగా గాయపడ్డారు. బైక్ పై పెళ్లికి వెళ్లి వస్తుండగా మార్గ మధ్యలో అడ్డగించి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పొలం దారి విషయంలో వివాదం కారణంగా సైదాబిపై దాడి చేశారని అతని కుమారుడు జిలానీ తెలిపారు.
Also Read: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్
దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల తుమ్మల చెరువు లోట్ ప్లాజా వద్ద ఓ వ్యక్తిపై అత్యంత దారుణంగా దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వ్యక్తిని రోడ్డు డివైడర్‌పై పడేసి కొందరు వ్యక్తులు కాళ్లు, చేతులు పట్టుకోగా మరో వ్యక్తి బండరాయి కొడుతున్నాడు. బాధితుడు నొప్పితట్టుకోలేక కేకలు పెడుతున్నా కనికరం లేకుండా దాడిచేశారు. ఇనుప రాడ్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వ్యక్తిని సైదాబిగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో బాధితుడ్ని నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదాబి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల శివారులో ప్రత్యర్థులు శివారెడ్డి, హేమంత్‌రెడ్డి, పున్నారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అన్నపురెడ్డి, నరసరావుపేటకు చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారు. పొలం గట్ల వివాదంతో ఈ దాడి జరిగిందని బాధితుడు తెలిపాడు.
Also Read: రూ.99కే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..
పొలం వివాదం... రాజకీయ కోణం లేదు
పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘటనపై గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఐపీఎస్ స్పందించారు. సామాజిక మాధ్యమాలలో తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద జరిగిన దాడి వీడియోను చూశానన్నారు. శివారెడ్డి, సైదాబి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య పొలం విషయంలో తగాదాలు జరుగుతుందన్నారు. దీంతో సైదాబిపై దాడి జరిగిందన్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై పిడుగురాళ్ల పోలీసులు FIR ౼ 651/2021 కింద బాధితులు సమాచారం మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గతంలో సైదాబి పొలం వివాదంలో శివారెడ్డిపై దాడి చేయగా శివారెడ్డి ఫిర్యాదు చేశారని తెలిపారు. పిడుగురాళ్ల పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారని ఎస్పీ ప్రకటించారు. పొలం వివాదంలో పాత కక్షల దృష్ట్యా ఈ ఘటన జరిగిందని దీనిలో ఎటువంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ విశాల్ గున్నీ తెలియజేశారు. చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సైదాబి చికిత్స పొందుతున్నారు.
Also Read: అమెజాన్‌లో కరివేపాకు పొడి.. తెరిచి చూస్తే గంజాయి.. నలుగురి అరెస్టు