ఆడా - మగ ఫ్రెండ్ షిప్ మీద సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. ఇద్దరి ఫ్రెండ్ షిప్ చివరికి ప్రేమతో ముగిసే కాన్సెప్ట్ కథలు వచ్చాయి. వేర్వేరు వ్యక్తుల్ని పెళ్లి చేసుకుని ... తర్వాత వారి స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకునే జీవిత భాగస్వాములు వచ్చినప్పుడు ఎదురయ్యే పరిస్థితులపై సినిమాలొచ్చాయి. అయితే ఫ్రెండ్‌షిప్‌ను తప్పుగా అర్థం  చేసుకుని అడ్వాంటేజ్ తీసుకుని లైంగిక వాంఛలు తీసుకోవాలనుకునే ఫ్రెండ్ ఉన్నకథలు మాత్రం పెద్దగా కనిపించవు. దీనికి కారణం అలాంటి మనస్థత్వం ఉండటం అసహజమే.  ఫ్రెండ్ షిప్‌ను అపవిత్రం చేయడమే. అలా చేయడం నేరం కూడా అని తాజాగా కోర్టు కూడా తీర్పు ఇచ్చింది.


Also Read: అనకాపల్లి అమ్మాయిలు అబ్బాయి కోసం కొట్టుకున్నారా? అసలు జరిగింది ఇదే.. ! ఆ అమ్మాయిల జీవితం ఇప్పుడెలా ఉందో తెలుసా ?


స్నేహంగా ఉన్నంత మాత్రాన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు అనుమతించినట్లు కాదని పోక్సో కోర్టు  తీర్పు చెప్పింది. ఈ కోర్టు ముందుకు వచ్చిన కేసులో ఇరవై ఏళ్ల యువకుడు..  తనతో స్నేహంగా ఉన్న మైనర్ బాలికతో లైంగిక వాంఛలు తీర్చుకునే ప్రయ.త్నం చేశాడు. లైంగికంగా వేధించాడు. తనతో స్నేహంగా ఉంటుందని... చొరవగా ఉంటుందని.., అతను ఆ ఆడ్వాంటేజ్ తీసుకున్నాడు.  చివరికి వ్యవహారం కేసుల వరకూ వెళ్లింది. కోర్టులోనూ అతను అదే వాదన వినిపించాడు. వాదనలు విన్న పోక్సో కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అబ్బాయితో అమ్మాయి స్నేహంగా ఉన్నంత మాత్రాన లైంగిక వాంఛలు తీర్చేందుకు అనుమతి ఇవ్వడం కాదని స్పష్టం చేసింది.


Also Read: ఈ ఏడాది డ్రంకన్ డ్రైవ్ కేసులే అత్యధికం... డ్రంకన్ డ్రైవ్ లో రూ.10.49 కోట్ల ఫైన్ వసూలు... నేరాల వివరాలు వెల్లడించిన సీపీ అంజనీ కుమార్


స్నేహితురాలి స్నేహాన్ని అంగీకారంగా భావించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి పోక్సో కోర్టు శిక్ష విధించింది. నేటి తరానికి ఈ శిక్ష ఓ పాఠం లాంటిదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. యువతరం స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు మార్గంలో పయనిస్తే జీవితం ప్రభావితమవుతుందని.. ఈ కేసులో అటు నిందితుడు..ఇటు బాధితురాలు కూడా జీవితంలో తీవ్రంగా నష్టపోతున్నారని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది.


Also Read: తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని మృతి... ఫస్టియర్ లో ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్య ..!


స్నేహం అనేది హద్దులు లేనిది. కానీ ఆడ, మగ స్నేహాల మధ్య మాత్రం ... కనిపించని హద్దులు ఉంటాయి. వాటిని ఎవరూ దాటకూడదు. ఈ హద్దులపై స్పష్టమైన అవగాహన ఉన్న వారు మాత్రమే... స్నేహాన్ని స్నేహంగా ఉంచుకుంటారు. లేకపోతే.. నేరస్తులుగా మిగిలిపోతారు. ఈ కేసు అందుకే అందరికీ ఓ పాఠంలా మారింది. 


Also Read: మద్యం ధరలపై వాగ్వాదం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి