హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ జ్యువెలరీ షోరూంలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. శ్రీకృష్ణ జ్యువెలరీకి చెందిన షోరూంలు, కార్యాలయాల్లో ఒకేసారి ఈడీ అధికారులు ఈ దాడులు చేస్తున్నారు. సుమారు రూ.330 కోట్ల విలువైన 1,100 కేజీల బంగారు ఆభరణాలను మళ్లించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఓ కేసు నమోదు చేసింది. 2019లో ఈ కేసులో ఎండీ ప్రదీప్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు కూడా చేశారు. ఆ కేసు ఆధారంగానే మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. ప్రస్తుతం నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబరు 1లో ఉన్న హెడ్ ఆఫీసు సహా ఇతర బ్రాంచీలు, జ్యువెలరీ షాపులు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Also Read: ఈటల స్వార్థం వల్లే ఈ ఉప ఎన్నికలు.. వ్యక్తి లాభమా? వ్యవస్థ లాభమా? తేల్చుకోండి: హరీశ్ రావు
కేసు వివరాలివీ..
భారీ గోల్డ్ స్కామ్‌గా పేర్కొంటున్న 2019 నాటి ఈ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై డీఆర్‌ఐ కేసు ఆధారంగా శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మీద ఈడీ దాడులు చేస్తోంది. బంగారం దిగుమతి విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు ఈ సోదాలు జరుపుతున్నారు. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్, ఆయన కుమారుడు సాయి చరణ్‌ను గతంలోనే డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేయగా.. రావిరాల జెమ్స్ అండ్ జ్యువెల్లెర్స్ పార్కులో ఉన్న శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌లో భారీ కుంభకోణం జరిగినట్టు ఈడీ గుర్తించింది.
Also Read: Smart Phone eVoting: స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ-ఓటింగ్.. దేశంలో మొదటిసారిగా తెలంగాణ నుంచే అమలు..
విదేశాల నుంచి అక్రమ రీతిలో బంగారం కొనుగోలు చేయడంతోపాటు, దాన్ని అక్రమంగా స్వదేశానికి తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 1,100 కిలోల బంగారాన్ని శ్రీ కృష్ణ జ్యువెలర్స్ తప్పుదోవ పట్టించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినట్లు గుర్తించారు. ఆభరణాల ఎగుమతుల్లో సైతం కుంభకోణం జరిగినట్లుగా గుర్తించారు. ఆభరణాల్లో పెట్టిన వజ్ర వైఢూర్యాలకు సంబంధించి కూడా సరైన దస్త్రాలు చూపకపోవడంతో ఈడీ అధికారులు శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌కి చెందిన అన్ని షోరూంలలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. శ్రీకృష్ణ జ్యువెలర్స్‌కు దేశ వ్యాప్తంగా 35 షోరూంలు ఉన్నాయి. ఈడీ సోదాల నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధుల హడావుడి కనిపించింది.
Also Read: ఏపీకి వర్ష సూచన, కొన్ని చోట్ల భారీ వానలకు ఛాన్స్.. తెలంగాణలో ఇలా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.