ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ ప్రేమలు యమపాశాలుగా మారుతున్నాయి. టీనేజీలోనే ఆకర్షణకు లోనవుతున్నారు. కానీ అదే ప్రేమగా భావించి, వారితో కలిసి జీవిస్తున్నామనుకుని హద్దులు సైతం దాటి ప్రవర్తిస్తున్నారు. చివరికి ప్రియురాలో లేక ప్రియుడో తనువు చాలిస్తున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకున్నా, లేనిపోని ఈగోలు, మనస్పర్థలు రావడంతో బలవన్మరణం చెందుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి..

Continues below advertisement


తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం గొగ్గన్నమఠానికి చెందిన నేల మనోజ్, రాజోలు తుపాను కాలనీకి చెందిన శ్రీలత(21) గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను వివాహ బంధంగా మలుచుకోవాలని ఆశపడ్డారు. ఎలాగోలా పెద్దలను ఒప్పించారు. వచ్చే నెలలో శ్రీలత, మనోజ్ వివాహం జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. పెద్దలు ఒప్పుకోవడంతో వీరి వివాహం సాఫీగా జరుగుతుందని, ఇక సమస్యలు లేవని భావించారు. కానీ అనూహ్య సంఘటన యువతి కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.
Also Read: బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. త్రీస్టార్ నుంచి బిచ్చగాళ్లుగా.. లాడ్జిల్లో ఎంజాయ్‌మెంట్, చివరికి..


నవంబర్ 12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ప్రియుడు మనోజ్‌తో శ్రీలత వాట్సాప్ చాటింగ్ చేసింది. అయితే ఏం జరిగిందో తెలియదు.. చాటింగ్ చేస్తుండగా వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తనకు ఇక బతకడం ఇష్టం లేదని, చనిపోతానని ప్రియుడికి శ్రీలత మెస్సేజ్ చేసింది. తాను చనిపోతానని మనోజ్ కు మెస్సేజ్ చేసిన తరువాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకునే సమయంలో సైతం ఫొటోలు తీసుకున్న శ్రీలత వాటిని మనోజ్‌కు వాట్సాప్ చేసి బలవన్మరణం చెందింది.
Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన పరిణామం, ఆయన్ను చంపింది అందుకే.. వెనుక బడా నేతలు..


ఇంటికి వచ్చి చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కూతురు ఉరికి వేలాడుతున్నట్లు గుర్తించారు. మనోజ్‌తో చాటింగ్ చేసిన తరువాత తన కూతురు చనిపోయిందని.. వివాహానికి అతడు నిరాకరించడంతోనే శ్రీలత మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
Also Read: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఊరట, ఇక్కడ మాత్రం స్థిరంగా.. తాజా రేట్లు ఇలా..
Also Read: వార్నీ.. దేవుడి కాళ్లకు మొక్కి మరీ గుడిలో హుండీని ఎత్తుపోయాడు, వీడియో వైరల్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి