Saral Vastu Chandrashekhar Guruji : కర్ణాటకలో వాస్తు నిపుణుడిగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర గురూజీ దారుణ హత్యకు గురయ్యారు. హుబ్బళ్లిలోని ఓ హోటల్‌లో ఆయన బస చేశారు. హోటల్ రిసెప్షన్‌లో ఉన్న సమయంలో ఇద్దరు యువకులు ఆయనతో గొడవపడి కత్తితో పొడిచారు. ఆ తర్వాత పరారయ్యారు. వెంటనే హోటల్ లో ఉన్న వారు చంద్రశేకర గురూజీని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయిందని... ఆయన చనిపోయారని డాక్టర్లు తేల్చారు. పోలీసులు వెంటనే సీసీ టీవీ ఫుటేజీ సాయంతో నిందితులను గుర్తించారు. అయితే వారు చంద్రశేఖర్ గురూజీని కత్తి పొడిచి పారిపోయారు.
సోషల్ మీడియాలో కనిపించే "సమస్యలు పరిష్కరించే బాబా"ను సంప్రదించాడు - 38 లక్షలు పోగొట్టుకున్నాడు !
వారి ఫోన్ నెట్వర్క్‌లను ట్రేస్ చేసిన పోలీసులు బెళగావి జిల్లాలో ఉన్నట్లుగా గుర్తించి పట్టుకున్నారు. హుబ్బళ్లికి తరలించి ఎందుకు చంద్రశేఖర్ గురూజీని చంపాల్సి వచ్చిందో ఇంటరాగేట్ చేస్తున్నారు. హోటల్‌లో బస చేస్తున్న సమయంలో కొంత మంది వ్యక్తులు రిసెప్షన్‌కు వచ్చి ఆయనను కలవాలని కోరారని.. ఆ మేరకు రిసెప్షన్‌ను రూమ్‌కు కాల్ చేయడంతో ఆయన తనను కలిసేందుకు వచ్చిన వారి కోసం కిందకు వచ్చారు. వారితో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి హఠాత్తుగా కత్తి తీసి పొడిచేశారని హుబ్బళ్లి పోలీస్ కమిషనర్ ప్రకటించారు.
అల్లుడి అంతం కోసం 4.5 లక్షలకు సుపారీ, హత్య తర్వాత దూరంగా ఎడమకాలు! వెలుగులోకి కీలక విషయాలు
హత్య గురించి తెలిసిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హుబ్బళ్లి పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. చంద్రశేఖర్ గురూజీని చంపడం అత్యంత కిరాతకమని మండిపడ్డారు హంతకులను తక్షణం అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
మాట్రిమోని సైట్ లో అమ్మాయిలా ఫేక్ ప్రొఫైల్, లక్షల్లో సమర్పించుకున్న బాధితులు!
సరళ వాస్తులో దిట్టగా పేరు పొందిన చంద్రశేకర్ గురుజీని మానవ్‌గురుగా కూడా పిలుస్తూంటారు. బాగల్‌కోట్ జిల్లాలో పుట్టిన చంద్రశేఖర్ కాంట్రాక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన తర్వాత ఆయన ముంబైలో ఉద్యోగం తెచ్చుకుని అక్కడికి మారారు. అక్కడే వాస్తు సలహాల బిజినెస్ ప్రారంభించారు. ఆయన చెప్పిన వాస్తు సలహాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముంబైలో ఉంటున్న ఆయన బంధువు కుటుంబంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హుబ్బళ్లి వచ్చారు. ఈ విషయం తెలిసే హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. అసలు హత్యకు కారణాలేమిటన్నదానిపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.