Matrimony Sites Cheating : అతనో జగత్ కిలాడి అమ్మాయిలా మాట్రిమోనిలో వివరాలు పెట్టి యాప్ లతో వాయిస్ మార్చి మాట్లాడతాడు. డబ్బులు కావాలని అడుగుతూ అందినకాడికి నొక్కేస్తు్న్నాడు. డబ్బులిచ్చిన బాధితులు తిరిగి చెల్లించమని అడిగితే రెస్పాండ్ లేకపోయేసరికి బాధితులకు అనుమానం వచ్చింది. నిందితుడు వేరే ఫోన్ నెంబర్ తో దివ్య శ్రీ అనే అమ్మాయికి బాబాయి లాగా మాట్లాడాడు. దీనిపై అనుమానం వచ్చిన సురేష్ అనే బాధితుడు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు.
అసలేం జరిగింది?
నిందితుడు కోమలి సూర్యప్రకాష్ కాకినాడకు చెందిన వాడని పోలీసులు తెలిపారు. సూర్యప్రకాశ్ 2016లో మౌనిక అనే అమ్మాయితో గోవాకి వెళ్లినపుడు గ్యాంబ్లింగ్ గేమ్ కి అలవాటు పడ్డాడు. అది వ్యసనంగా మారడంతో సొంత వ్యాపారంలో నష్టం వచ్చింది. ఈ విషయం తెలిసిన సూర్యప్రకాశ్ తండ్రి 2018లో కాకినాడ రూరల్ తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టాడు. దీంతో మౌనిక అతన్ని వదిలివెళ్లిపోయింది. 2019లో నిందితుడు హైదరాబాద్ వచ్చి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడడం మొదలుపెట్టాడు. అలా వచ్చిన డబ్బులతో గోవాకి వెళ్లి గ్యాంబ్లింగ్ ఆడి జల్సాలు చేసేవాడు. ఆ తర్వాత నెల్లూరుకి చెందిన సూర్యప్రకాశ్ సింధు మహిళతో తెలుగు మాట్రిమోనీలో పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయికి రూ.18 లక్షల వరకు ఇచ్చి మోసపోయాడు. ఆ తర్వాత తెలుగు మాట్రిమోనీలో 2020లో హైదరాబాద్ ఆల్వాల్ కి చెందిన నీల అనే అమ్మాయి పరిచయం అయింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో నిందితుడిపై రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు పెట్టింది. ఈ కేసులు సూర్యప్రకాశ్ జైలుకి వెళ్లి వచ్చాడు.
ఫేక్ ప్రొఫైల్ తో
తన జల్సాలకు డబ్బులు చాలకపోవడంతో మాట్రిమోనీలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అమాయకులను మోసం చేయడం మొదలుపెట్టాడు నిందితుడు. గూగుల్ నుంచి గుర్తు తెలియని అమ్మాయిల ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని, ఫేక్ నంబర్ తో Whats App క్రియేట్ చేసి మాట్రిమోనీలో ప్రొఫైల్ కి అప్లోడ్ చేశాడు. ఆ నంబర్ కు మాట్రిమోనీ సైట్ నుంచి ఫోన్లు వచ్చేయి. వాయిస్ ఛేంజ్ యాప్ ల ద్వారా అమ్మాయిలా మాట్లాడేవాడు. ఇలాగే మూడెత్తుల సురేష్ యాదవ్ పేరుతో నిందితుడికి ఒక రిక్వెస్ట్ వచ్చింది. సురేష్ తో ఛాటింగ్ చేయడం మొదలుపెట్టాడు నిందితుడు. ఇక అమ్మాయిలాగా వాయిస్ మార్చి మాట్లాడేవాడు. నిందితుడు తనపేరు దివ్య శ్రీ అని పరిచయం చేసుకున్నారు. గూగుల్ డౌన్ లోడ్ చేసిన ఫొటోలతో ఒక కుటుంబాన్ని సృష్టించి సురేష్ ను పెళ్లి చేసుకునేందుకు ఇష్టమే అని చెప్పాడు. వాయిస్ మార్చి పెళ్లి కూతురు తండ్రిలా మాట్లాడేవాడు కూడా. ఇదే క్రమంలో నిందితుడు తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నట్లుగా నాటకం ఆడి సురేష్ నుంచి డబ్బులు తీసుకున్నాడు.
ఆర్మీ జవానును కూాడా
సురేష్ ఆ మాటలు నమ్మి తన బ్యాంకు అకౌంట్ నుంచి నిందితుడు అడిగినప్పుడల్లా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుండేవాడు. ఈ విధంగా నెలరోజులలోనే తన మాయ మాటలతో నమ్మించి సురేష్ నుంచి నిందితుడు దాదాపు 8 లక్షల రూపాయల కొట్టేశాడు. ఇదే విధంగా తెలుగు మాట్రిమోనీలో ఒడిశాకి చెందిన నీల మోహన్ అనే ఆర్మీ జవానుతో ఇదే విధంగా ఛాటింగ్ చేసి రూ. 12 లక్షలు దోచేశాడు. చివరికి నిజం తెలుసుకున్న సురేష్ రామగుండం ఎన్టీపీసీ పోలీసుల సాయంతో నిందితుడ్ని పట్టుకున్నారు.