Bengaluru Over 50 Pieces Of Mahalakshmi Body Found In Fridge  Suspect Traced To Bengal : మనుషుల్ని కిరాతకంగా చంపి బాత్‌రూమ్‌లో పెట్టి ముక్కలు చేసి కవర్లలో పెట్టి అక్కడో చోట.. అక్కడో చోట విసిరేసే సైకో కిల్లర్ కథతో సెక్టార్36 అనే సినిమా తాజాగా ఓటీటీలో విడుదలయింది. దాన్ని చూసిన  వారికి.. ఇంతటి కిరాతకులు కూడా ఉంటారా అన్న డౌట్ వస్తుంది. కానీ అప్పుడప్పుడూ వెలుగుచూసే భయంకరమైన నేరాలతో.. ఉంటారని అనుకోక తప్పదు. ఆ సెక్టర్ 36 కథ నిజమైన కథేనంటారు కానీ.. నిజమేమిటో స్పష్టంగా తెలియదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది మాత్రం నిప్పులాంటి నిజమైన సైకో కథ.                        


బెంగళూరులోని మల్లేశ్వరంలో ఓ ఇంట్లో సింగిల్ బెడ్ రూం పోర్షన్ అద్దెకు తీసుకుని ఉంటోంది మహాలక్ష్మి అనే మహిళ. భర్తకు దూరంగా ఉంటోంది. ఓ షాపింగ్ మాల్‌లో పని చేసుకుంటోంది. ఆమె వారం రోజుల నుంచి బయటకు రావడం లేదు. కనిపించలేదు. పైగా ఇంట్లో నుంచి దుర్వాసన వస్తూండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తాళాలు బద్దలు కొట్టి చూశారు. ఎక్కడా కనిపించలేదు కానీ.. ఫ్రిజ్ నుంచి  వాసన వస్తున్నట్లుగా గుర్తించారు.. తెరిచి చూశారు. అంతే.. ఎన్నో నేరాలు చూసిన వాళ్లకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. 


హీరోయిన్ జెత్వానీపై ముగ్గురు ఐపీఎస్‌ల కుట్ర - కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు


ఆ ఫ్రిజ్‌లో మహిళ శరీర భాగాలున్నాయి. పోరెన్సిక్ ను పిలిపించి మిగతా పనులు పూర్తి చేశారు. మొత్తంగా యాభై వరకూ ముక్కలు చేసి.. ఫ్రిజ్ పెట్టి వెళ్లిపోయాడు హంతకుడు. అతను ఎవరా అని ఆరా తీస్తే ఎవరికీ సమాచారం తెలియదు. మహాలక్ష్మి పని చేసే షాపింగ్ మాల్‌లో ఆరా తీశారు. అక్కడ కూడా ఎవరికీ తెలియదు. కానీ అతను రోజూ మహాలక్ష్మిని మాల్‌కు తీసుకు వచ్చి .. మళ్లీ తీసుకు వెళ్తాడని చెప్పారు. దాంతో సీసీ ఫుటేజీ చూసి..అతని ఆనవాళ్లను గుర్తించారు. ఇతర వివరాలు తీసుకుని మొత్తం జల్లెడ పట్టారు. కానీ బెంగళూరులో లేడని తేలింది. అతి కష్టం మీద అతను బెంగళూరులో ఉన్నాడని గుర్తించారు.            


చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు 


మహాలక్ష్మి కూడా కర్ణాటకకు చెందిన వ్యక్తి కాదని.. ఆ వ్యక్తి బెంగాల్ కు చెందిన వాడని  పోలీసులు చెప్పారు. ఇద్దరూ కలిసి ఉండేవారని గొడవలతో ఈ హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు. ఇంత ఘోరమైన  హత్య మల్లేశ్వరంలో జరగడంతో ఆ చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇలాంటి నేరాలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.