Karunakar Reddy made a ruckus in front of the Tirumala temple to take the oath : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ హయాంలో కొన్నాళ్లు భూమన కరుణాకర్ రెడ్డి కూడా టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత రాజీనామా చేశారు. దీంతో నెయ్యి కల్తీ అంశంపై ఆయనపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తాను కొండపై ప్రమాణం చేస్తానని ఆయన అనుచరులతో కలిసి తిరుమలకు వచ్చారు. తిరుమల ఆలయం ముందు నమస్కరించి బేడీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చారు.
ఆ తర్వతా టెంకాయ కొట్టి ప్రమాణం చేస్తున్నట్లుగా మీడియా ప్రతినిధులతో రాజకీయ అంశాలు మాట్లాడుతూండటంతో టీటీడీ అధికారులు, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అక్కడి లాగేసే ప్రయత్నం చేయడంతో.. తాను అనుకన్న ప్రమాణాన్ని తోపులాట మధ్యే పూర్తి చేశారు. లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలిపినట్లయితే అపచారం చేసి ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి అనే నేను నా కుటుంబం సర్వ నాశనం అవుతుందని ప్రమాణంలో పేర్కొన్నారు. తర్వాత తిరుమల లో రాజకీయ అంశాలు మాట్లాడరాదని టిటిడి మాజీ చైర్మన్ కు, తిరుపతి ఎంపీ గురుమూర్తికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
'శ్రీవారి భక్తులూ ఈ మంత్రం జపించండి' - భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి
వైసీపీ హయాంలో తిరుమలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. చివరికి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలోనూ అక్రమాలకు పాల్పడ్డారని యానిమల్ ఫ్యాట్ వాడారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఈ ఆరోపణ చేసిన తరవతా ఒక్క సారిగా రాజకీయం మారిపోయింది. వైసీపీ హయాంలో కొనుగోలు చేసిన నెయ్యికి సంబందిచిన ల్యాబ్ రిపోర్టులు వెలుగు చూశాయి. అందులో ఫిష్ ఆయిల్, పందికొవ్వు వాడినట్లుగా తేలింది. అవన్నీ వైరల్ అయ్యాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం .. తాము తిరుమల పవిత్రత పెంచామని అలాంటి పనులు చేయలేదని దేనికైనా ప్రమాణానికి సిద్ధమని సవాల్ చేస్తూ వస్తున్నారు.