దుర్గమ్మకు  భక్తులు మొక్కులుగా చెల్లించిన సొమ్మునే కాజేద్దామనుకున్నాడు. కానీ దేవుడితో పెట్టుకుంటే సేఫ్‌గా బయటపడగలమా ? అతని ప్రయత్నం ఫలించకుండానే దొరికిపోయాడు. దుర్గమ్మ హుండీలు లెక్కించే హాల్‌కు దగ్గరలో ఉన్న టాయిలెట్లలో  కొన్ని నగలు, నాలుగు వేల నగదు బయటపడింది. ఆ సొమ్ము అలా ఎక్కడికి వచ్చిందా అధికారులు హైరానా పడ్డారు. గంటల తరబడి సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషించారు. చివరికి ఓ వ్యక్తి వాటిని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారని తేల్చారు. ఆ వ్యక్తిని పట్టుకున్నారు. చివరికి అతను అక్కడ పని చేసే అటెండరేనని తేలింది. 


గదిలో భార్య ఉండగా బయట గోడ కట్టేసిన భర్త - పుల్లారెడ్డి మనవడి నిర్వాకం !
  
కనక దుర్గమ్మ హుండీ కానుక‌ల లెక్కింపు సమయంలో దేవ‌స్థానం ఉద్యోగి చేతివాటం ప్ర‌ద‌ర్శించి న‌గ‌దు, బంగారం త‌స్క‌రించాడు. ఈ ఘ‌ట‌న‌పై ఈనెల 10న దుర్గ‌గుడి అధికారులు వ‌న్‌టౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు డీసీపీ, ఏసీపీల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నాలుగు బృందాలుగా ఏర్ప‌డి ద‌ర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు. 


పెళ్లిలో విషం తాగిన వధువు, సరిగ్గా అప్పగింతలకు ముందు - అసలేం జరిగిందంటే


ఈ నెల 9న జ‌రిగిన హుండీ లెక్కింపులో పాల్గొన్న అటెండ‌ర్ క‌గ్గా పుల్లారావు కొన్ని బంగారు వ‌స్తువుల‌ను త‌న సొంతానికి వాడుకోవాల‌న్న దుర్భుద్ధితో  కొన్నింటిని అధికారుల క‌ళ్లుగ‌ప్పి తాను టాయిలెట్‌కు వెళ్తున్న‌ట్లు బాత్‌రూమ్‌లో దాచుకొని ఎవ‌రూ లేని స‌మ‌యంలో తిరిగి తీసుకుందామ‌నుకున్నాడ‌ు.  అయితే  అక్క‌డ విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీస్ సిబ్బంది న‌గ‌ను గుర్తించ‌డంతో అధికారుల‌కు ఫిర్యాదు చేశార‌ని తెలిపారు. నాలుగు బృందాలుగా ఏర్పడి   సి.సి. కెమెరాల ద్వారా హుండిల లెక్కింపు సమయంలో పాల్గొన్న‌ కదలికలను నిశితంగా పరిశీలించి, అందరిని విచారించామ‌ని పోలీసులు తెలిపారు. 


. 12 లక్షలు ఇస్తే రూ.కోటి రిటర్న్, ఆ బాబా స్పెషాలిటీ అదే, చివర్లో ట్విస్ట్!


 దేవ‌స్థానంలో అటెండర్ గా పనిచేస్తున్న విజయవాడ మల్లికార్జున పేటకు చెందిన‌  కగ్గా పుల్లారావును నిందితుడుగా గుర్తించి అరెస్ట్ చేశారు.  మే 9న  జరిగిన హుండీ లెక్కింపులో అక్రమంగా టాయిలెట్ లో దాచిపెట్టిన బంగారు వస్తువులు, నాలుగు వేల రూపాయల నగదును అదే తరహాలో ఏప్రిల్ 11న‌ జరిగిన లెక్కింపులో దాచిపెట్టిన పది వేల రూపాయల నగదును, ఏప్రిల్ 20న  దాచిపెట్టిన ఆరు వేల రూపాయల నగదును అతడి నుంచి స్వాధీనం చేసుకున్నార‌ు.