సినిమాల్లో విలన్ ని అరెస్ట్ చేయడానికి డెన్ కి వెళ్లిన  పోలీసులపై విలన్ గ్యాంగ్ తిరగబడుతుంది. సరిగ్గా నెల్లూరులో కూడా అదే జరిగింది. ఓ కేసు విచారణలో భాగంగా అనుమానితుడ్ని పట్టుకోవడానికి వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ పైనే హత్యాయత్నం జరిగింది. గొంతుకోసి నానా హంగామా సృష్టించాడు ఓ వ్యక్తి. చివరకు పోలీస్ కానిస్టేబుల్ తప్పించుకుని కొనఊపిరితో ఆస్పత్రిలో చేరాడు. జిల్లా ఎస్పీ ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ రాజాని పరామర్శించి ధైర్యం చెప్పారు. డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడి చేసిన కేసులో బాబులాల్ కైలాష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 


అసలేంటి కథ..? 
కొత్త సంవత్సరం తొలిరోజున నెల్లూరులో ఓ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంటిని, ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారుని గుర్తు తెలియని వ్యక్తి తగలబెట్టాడు. అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కుటుంబ కలహాల వల్లే ఇంటిని, కారుని తగలబెట్టారని తెలిసింది. 


బాబూలాల్ కైలాష్ అనే వ్యక్తి 20ఏళ్ల క్రితం తన ఇద్దరు తమ్ముళ్లతో కలసి రాజస్థాన్ నుంచి నెల్లూరుకి వచ్చి స్థిరపడ్డాడు. బంగారు వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత ఎవరి కుటుంబాలు వారు వేరుపడ్డారు. ఈ క్రమంలో బాబూలాల్ మద్యానికి బానిసయ్యాడు. భార్యా బిడ్డల్ని కూడా సరిగా చూసుకోలేదు. రాజస్థాన్ వెళ్లినప్పుడు అక్కడ సొంతింటిని కూడా తగలబెట్టాడని సమాచారం. ఏడాదిన్నర క్రితం భార్యపై కత్తితో దాడి చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు బాబూలాల్ ఇటీవలే బెయిలుపై విడుదలయ్యాడు. అయితే అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలతో వారిపై కక్ష పెంచుకున్న బాబూలాల్ తమ్ముళ్ల ఇళ్లపై పెట్రోల్ పోసి తగలబెట్టాడని అంటున్నారు. ఈ కేసులో విచారణ సందర్భంగా బాబూలాల్ ఎక్కడున్నారో కనుక్కుని కానిస్టేబుల్ రాజా అతడి వద్దకు వెళ్లాడు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారని తెలిసే సరికి బాబూలాల్ కానిస్టేబుల్ పై దాడి చేసి తప్పించుకోబోయాడు ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ గుడిసెను కూడా అతడు తగలబెట్టాడు. కానిస్టేబుల్ రక్త గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత పోలీస్ బలగాలు బాబూలాల్ ని అరెస్ట్ చేశాయి. 


నెల్లూరులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడి జరగడం సంచలనంగా మారింది. వెంటనే కానిస్టేబుల్ ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స మొదలు పెట్టారు. మెడపై గాయాలు కావడంతో అత్యవసర వైద్యం అందించారు. జిల్లా ఎస్పీ విజయరావు కానిస్టేబుల్ ని పరామర్శించారు. 


Also Read: RGV Questions AP Govt: వర్మ వదలడం లేదుగా... ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ సంధించిన తాజా ప్రశ్నలు!


Also Read: RGV: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ.. 


Also Read: RGV Vs Perni Nani: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు


Also Read: RGV: పవన్ సినిమాకి సంపూ సినిమాకి తేడా లేనప్పుడు మీ ప్రభుత్వంలో మంత్రికి డ్రైవర్‌కి కూడా తేడా లేదా? ఆర్జీవీ స్ట్రాంగ్‌ కౌంటర్


Also Read: KTR On Nadda : బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ.. జేపీ నడ్డా అబద్దాలకు అడ్డా అని కేటీఆర్ విమర్శ !


Also Read: Cryptocurrency Prices Today, 05 January 2022: క్రిప్టో మార్కెట్లో వీడని స్తబ్దత! ఆచితూచి ఇన్వెస్టర్ల కొనుగోళ్లు