తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు సరికొత్త మార్గాల్లో తమ దందాను కొనసాగిస్తున్నారు. అయితే వేరే ప్రాంతాల్లో నుంచి గంజాయి రవాణా చేయడం రిస్క్ అని భావించి సొంతంగా సాగుచేస్తున్నారు. 


పూలతోటలో గట్టుచప్పుడు కాకుండా సాగు


చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో గంజాయి సాగు కలకలం రేపుతోంది. పూల తోట మధ్యలో గంజాయి సాగు చేస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏ.రంగంపేటలో గంజాయి సాగు చేస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులకు సమాచారం అందడంతో అధికారులు పకడ్బందీగా దాడులు నిర్వహించారు. కొట్టే వెంకటరమణ యాదవ్ అనే వ్యక్తి గ్రామ శివారుల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. పూలతోట మధ్యలో 6 అడుగుల పొడవుగల పది గంజాయి మొక్కలను అధికారులు గుర్తించారు. గంజాయిని అధికారులు సీజ్ చేశారు. ఈ గంజాయి మొత్తం10.5 కిలోల బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు వెంకటరమణ యాదవ్ పై గతంలో కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పచ్చని ప్రశాంతమైన పల్లెలో గంజాయి సాగు చేస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.


Also Read: గంజాయి రవాణాలో కొత్త దారులు.... బోర్ వెల్ లారీలో రూ.2 కోట్ల గంజాయి పట్టివేత...





మొక్కజొన్న తోటలో గంజాయి సాగు




తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ధన్‌సింగ్ తండాకు చెందిన రతన్ సింగ్ అనే వ్యక్తి మొక్కజొన్న, కంది పంటలు సాగుచేస్తున్నాడు. ప్రధాన పంటలు ఇవే అయినా అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన అబ్కారీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. రతన్ సింగ్ పొలంలో 267 గంజాయి మొక్కలను గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. రతన్ సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Also Read: కీలక దశకు దిశ నిందితుల ఎన్ కౌంటర్ విచారణ.. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఎదుటకు సజ్జనార్..!


Also Read: 80 ఏళ్ల బామ్మపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం.. అనంతరం బాలికపై మరో రేప్‌నకు యత్నం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి