కరోనా వ్యాప్తి తరువాత ఉద్యోగాల కొరత అధికమైంది. ఈ క్రమంలో విడుదల అవుతున్న నోటిఫికేషన్లకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐఏసీఎల్) సైతం ఇటీవల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్ఐఏసీఎల్ ఏవో అడ్మిడ్ కార్డులను సంస్థ రిలీజ్ చేసింది. అక్టోబర్ 16వ తేదీ వరకు హాల్ టికెట్లు అందుబాటులోకి ఉంటాయని స్పష్టం చేశారు.
ఏవో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్ల (NIACL AO Admit Card 2021)ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సంస్థ సూచించింది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ఏవో అడ్మిట్ కార్డుల పేజ్ 1 పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఈ NIACL AO Admit Card లింక్ మీద క్లిక్ చేసి ఏవో అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Also Read: టెన్త్ విద్యార్హతతో ఎస్ఎస్‌సీలో 1,775 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
ఎన్ఐఏసీఎల్ ఏవో అడ్మిట్ కార్డులు 2021 డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇది..
1. మొదటగా అధికారిక వెబ్ సైట్ లింక్ newindia.co.in. మీద క్లిక్ చేయండి
2. వెబ్ సైట్ హోం పేజీలో రిక్రూట్‌మెంట్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి
2. CLICK HERE TO DOWNLOAD CALL-LETTER FOR PHASE-I (PRELIMINARY) EXAM ఆప్షన్ ఎంచుకోవాలి
4. స్క్రీన్ మీద కనిపిస్తున్న లాగిన్ పేజీలో అభ్యర్థులు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రూల్ నెంబర్ మరియు పాస్ వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాలి
5. స్క్రీన్ మీద ఏవో అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్ చేసుకోవాలి.
Also Read: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..
100 ప్రశ్నలు.. 100 మార్కులు..
ఈ పరీక్షను ఫేజ్ 1లో 100 మార్కులు కేటాయించారు. 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి.. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు. ఇంగ్లీష్ ల్యాంగ్వేజ్ పై 30 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీపై 35 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు 35 ప్రశ్నలు ఇస్తారు. ఫేజ్ 1 పరీక్షలో ఉత్తీర్ణయిన మెరిట్ అభ్యర్థులను ఫేజ్ 2 పరీక్షకు అనుమతిస్తారు. ఆపై పోస్టుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.