తూర్పు గోదావరి జిల్లా పోలీసులు భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎమ్. రవీంద్రనాథ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా సరిహద్దులో అల్లూరికోట నుంచి భారీ ఎత్తున గంజాయిని కూలీలతో రవాణా చేస్తున్నారన్న కచ్చితమైన సమాచారంతో గత రెండు రోజులుగా పోలీసులు నిఘా పెట్టారు. చింతూరు సబ్-డివిజన్ ఏఎస్పీ కృష్ణకాంత్ పర్యవేక్షణలో సీఐ యువకుమార్, మోతుగూడెం ఎస్సై వి.సత్తిబాబు శుక్రవారం చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా చేపట్టారు.
Also Read : ఎగ్ దోశకు డబ్బు ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన
వాటర్ డ్రమ్ముల్లో గంజాయి
వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో 500 లీటర్ల వాటర్ డ్రమ్ము్ల్లో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినారు. వారి వద్ద నుండి 3350 కేజీల గంజాయి, ఒక లారీ, ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీన పరుచుకున్న గంజాయి విలువ సుమారు రూ.3 కోట్ల 50 లక్షలుగా గుర్తించారు.
ఇద్దరు యూపీ, మరో ఇద్దరు ఏపీ
అరెస్టైన వారిలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన విశాల్ సింగ్, రింటు, చింతూరుకు చెందిన వంతల బాబూరావు, కిలో గోపాల్ రావు ఉన్నారు. పెద్ద మొత్తంలో తరలిస్తున్న గంజాయిని చాకచక్యంగా పట్టుకున్న చింతూరు ఏఎస్పీ జి.కృష్ణకాంత్, చింతూరు సర్కిల్-ఇన్స్పెక్టర్ జి.యువకుమార్, మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వి.సత్తిబాబు, వారి బృందాన్ని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అభినందించారు.
Also Read: మటన్ ముక్కలు వేయలేదని చంపేశాడు.. సంగారెడ్డిలో దారుణం.