అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అమడగూరు మండలంలోని ములకవారిపల్లి తండాలో చెరువులో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. చెరువులోకి దిగిన చిన్నారులు ప్రమాదవశాత్తు గల్లంతైనట్లు తెలుస్తోంది. చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనవారిలో లాలూ ప్రసాద్ నాయక్ నాలుగో తరగతి, పురుషోత్తం నాయక్ ఆరో తరగతి, హేమంత్ నాయక్ ఏడో తరగతి చదువుతున్నారు. దసరా సెలవుల కారణంగా సరదాగా చెరువు వైపు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకు విద్యార్థులకు ఆచూకీ లభించలేదు. ఓకే తండాకు చెందిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మునిగి గల్లంతు అవ్వడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నారు.
Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..
మహిళ కాపాడిన పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గోదావరి బ్రిడ్జ్ పై నుంచి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ మహిళను రావులపాలెం హైవే మొబైల్ పోలీసులు రక్షించారు. సోమవారం సాయంత్రం రాజమండ్రికి చెందిన ఏరుబండి చక్ర వేణి(33) అనే మహిళ గోదావరి బ్రిడ్జ్ పై నుంచి నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తుండగా అటు వైపుగా వెళ్తున్న రావులపాలెం హైవే మొబైల్ సిబ్బంది ఆమెను గమనించి అడ్డుకున్నారు. తన సమస్యలు పోలీస్ సిబ్బంది చెప్పి ఆ మహిళ బోరున విలపించింది. తన అత్తవారి ఊరు రాజమండ్రి వెంకట నగర్ అని, అమ్మగారి ఊరు రాజనగరం మండలం కానవరం కాగా ఒక పాప, ఒక బాబు సంతానం అని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నాలుగేళ్ల కిందట భర్త చనిపోవడంతో పిల్లల పోషణ, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించానని కన్నీటి పర్యాంతం అయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఆమెను సురక్షితంగా రావులపాలెం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు.
Also Read: నిద్రపోతున్న ఫ్యామిలీపై కూలిన పైకప్పు.. శాశ్వత నిద్రలోకి ఐదుగురు.. సీఎం దిగ్భ్రాంతి
రాజమహేంద్రవరంలో దారుణ ఘటన
రాజమహేంద్రవరం పట్టణంలోని ఆనంద్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. తాడేపల్లికి చెందిన అనూష అనే మహిళ భర్త 13 ఏళ్ల కిందట చనిపోవడంతో రాజమండ్రికి వచ్చి బ్యూటీషియన్‌గా పనిచేస్తూ ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇటీవల పిల్లల విషయంలో ఆమె తల్లితో కూడా గొడవ పడింది. పిల్లల్ని కొట్టద్దని అడ్డు వచ్చిన తల్లి ముత్యం కనకదుర్గను సైతం అనూష గాయపర్చింది. దీంతో ఆమె చెయ్యి గూడు విరగడంతో తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై లక్ష్మి అనూష సోదరులు వారి మేనమామకు సమాచారం అందించడంతో వారు లక్ష్మీ అనూషకు ఫోన్ చేసి మందలించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కుమార్తె ఎనిమిదేళ్ల చిన్మయి, ఆరేళ్ల మోహిత్‌ను ఇంట్లో ఉరివేసి చంపేసిందని స్థానికులు, బంధువులు వెల్లడించారు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం చిన్నారుల మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి మూడో పట్టణ పోలీసులు నిందితురాలు అనూషను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Also Read: నిజామాబాద్ చిన్నారి ఆచూకీ లభ్యం... మహారాష్ట్రలో పాపను వదిలివెళ్లిన కిడ్నాపర్లు...
అయితే.. పిల్లలను ఉరివేసి చంపిన అనంతరం అనూష ప్రియుడికి ఫోన్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. పిల్లల్ని చంపేసినట్లుగా బంధువులకు కూడా ఫోన్ చేసి తెలపడంతో వారు ఆగమేఘాలపై ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇంట్లో అనూష ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా వారు నిరోధించారు. అనంతరం చనిపోయిన పిల్లల్ని అనుష్కను 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికి పిల్లలను హతమార్చిందా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో తాము విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
Also Read: పోలీసులు వేధిస్తున్నారని యువకుడు ఆత్మహత్యాయత్నం ... వైరల్ అయిన వీడియో