Man Detained A Girl In Hotel Room In Hyderabad: సోషల్ మీడియా పరిచయం ఓ బాలికను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇన్ స్టాగ్రాంలో పరిచయమైన ఓ వ్యక్తి బాలికను 20 రోజులుగా గదిలో బంధించి వేధించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాకు (Mahabubnagar District) చెందిన కృష్ణచైతన్య.. భైంసాకు చెందిన విద్యార్థినిని ఇన్ స్టాగ్రాంలో ట్రాప్ చేశాడు. అతనితో పరిచయమైన క్రమంలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నిందితుడు ఆమె హైదరాబాద్ వచ్చేలా చేశాడు. నగరానికి చేరుకున్న అనంతరం నారాయణగూడలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. ఇలా బాలికను 20 రోజులుగా ఓ హోటల్ రూంలో బంధించి వేధించాడు. ఈ క్రమంలో బాలిక అస్వస్థతకు గురి కాగా.. స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు.


డోర్‌కు లాక్ వేసి..


బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. నారాయణగూడలోని (Narayanaguda) ఓ హోటల్ రూంకు తీసుకొచ్చాడు. ఆమె గది లోపలికి వెళ్లగానే బయట డోర్ లాక్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. అంతేకాకుండా లైవ్ లొకేషన్‌ను వాట్సాప్‌లో షేర్ చేసింది. ఈ క్రమంలో ఆందోళనతో నగరానికి చేరిన బాలిక తల్లిదండ్రులు షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన షీ టీమ్స్, నారాయణగూడ పోలీసుల సహకారంతో బాలికను రెస్క్యూ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బీటెక్ పూర్తి చేసి.. నగరంలో సాఫ్ట్ వేర్ కోర్సు చేస్తున్నాడని.. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


Also Read: Telangana MLA Disqualification Petitions: అనర్హత పిటిషన్లపై నెల రోజుల్లో తేల్చండి - తెలంగాణ స్పీకర్‌కు హైకోరు ఆదేశం