యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న తాజా సినిమా 'క' (KA Movie). భారీ పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతానికి సౌత్ ఇండియన్ సినిమా అని చెప్పాలి. ఎందుకంటే... తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కంటెంట్ హిందీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాట బావుండటంతో ఈ సినిమా మీద మాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) దృష్టి పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే...


మలయాళంలో 'క'ను విడుదల చేయనున్న దుల్కర్
KA Movie Malayalam Release: దుల్కర్ సల్మాన్ నటుడు మాత్రమే కాదు... ఆయన నిర్మాత కూడా! Wayfarer Films పేరుతో ఆయనకు ఓ ప్రొడక్షన్ హౌస్ ఉంది. 'క' చిత్రాన్ని మలయాళంలో విడుదల చేసేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రచార చిత్రాలు, పాటలు నచ్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.


Also Read'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'






'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్' పాటకు మంచి స్పందన
'క' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్...' ఆగస్టులో విడుదల కాగా... అన్ని భాషల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ పాటలో 'క'లో హీరో కిరణ్ అబ్బవరం వాసుదేవ్ క్యారెక్టరైజేషన్ ఆవిష్కరించారు. ఆ పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు అందించిన సాహిత్యం నుంచి సామ్ సీఎస్ సంగీతం, కపిల్ కపిలన్ గాత్రం వరకు అన్ని భలే కుదిరాయి.


Also Readనయన్... భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించెన్ - భర్త, పిల్లలతో కలిసి హిందూ పద్ధతిలో!



KA Movie Cast And Crew: 'క' సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం మీద చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు దర్శక ద్వయం సుజీత్, సందీప్. ఈ చిత్రానికి కూర్పు: శ్రీ వరప్రసాద్, ఛాయాగ్రహణం: విశ్వాస్ డానియేల్ - సతీష్ రెడ్డి మాసం, సంగీతం: సామ్ సీఎస్, ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చవాన్, క్రియేటివ్ నిర్మాత: రితికేష్ గోరక్, సీఈవో: రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్), కాస్ట్యూమ్స్: అనూష పుంజ్ల, ఫైట్స్: 'రియల్' సతీష్ - రామ్ కృష్ణన్ - ఉయ్యాల శంకర్, నృత్య దర్శకత్వం: పొలాకి విజయ్, వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్: ఎంఎస్ కుమార్, వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్: ఫణిరాజా కస్తూరి, సహ నిర్మాతలు: చింతా వినీషా రెడ్డి - చింతా రాజశేఖర్ రెడ్డి, నిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి, రచన - దర్శకత్వం: సుజీత్ - సందీప్.


Also Read: 'రామ్ నగర్ బన్నీ'గా యాటిట్యూడ్ స్టార్... టైటిల్‌లో అల్లు అర్జున్, సినిమాలో పవన్!