Fake Currency Identified in Hyderabad: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad)లో భారీగా నకిలీ నోట్లు పట్టబడడం కలకలం రేపింది. బాలాపూర్ (Balapur) పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.25 లక్షల నకిలీ కరెన్సీని మహేశ్వరం (Maheswaram) ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చిన నలుగురు కారులో నకిలీ కరెన్సీని తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎర్రకుంట వద్ద అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేయగా నకిలీ కరెన్సీ గుర్తించారు. నిందితులు మూడింతల నకిలీ కరెన్సీ ఇచ్చి ఒకింత ఒరిజినల్ కరెన్సీ తీసుకుని చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి నకిలీ కరెన్సీ, ఓ కారు, 4 మొబైల్ ఫోన్స్, కీప్యాడ్ మొబైల్, రూ.8,240 ఒరిజినల్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Continues below advertisement


Also Read: Phone Tapping Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు మూలం ట్యాపింగ్ - రాధాకిషన్ రావు నేతృత్వంలోనే జరిగిందా ?