Real Estate Sector Expectations From Union Budget 2025: ఫిబ్రవరి 01న, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను  (Budget FY 2025-26) ప్రవేశపెట్టనున్నారు. దేశంలో, స్థిరాస్తి రంగం ఈ బడ్జెట్‌ మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలు నిజమైతే అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి, దీర్ఘకాలిక సవాళ్లు కూడా పరిష్కారమవుతాయి. స్థిరాస్తి రంగానికి సర్కారు మద్దతు లభిస్తే, ఆర్థికాభివృద్ధితో పాటు అందరికీ గృహనిర్మాణం అనే ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుందని రియల్‌ ఎస్టేట్‌ లీడర్లు చెబుతున్నారు.                 


బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగం అంచనాలు
"పరిశ్రమ" హోదా కోసం రియల్ ఎస్టేట్ రంగం చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు... ఆదాయ పన్ను చట్టం ప్రకారం, గృహ రుణాన్ని ప్రత్యేక కేటగిరీ కిందకు మార్చాలని & గృహ రుణం వడ్డీపై పన్ను మినహాయింపును రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని, తద్వారా గృహ కొనుగోలుదారులకు ఊరట లభిస్తుందని కూడా డిమాండ్ చేస్తోంది. దేశంలోని పెద్ద నగరాల్లో పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఎక్కువ మంది పొందేందుకు వీలుగా అందుబాటు గృహాల (Affordable housing) నిర్వచనాన్ని మార్చాలనే కూడా చెబుతోంది. రియల్ ఎస్టేట్ రంగంపై స్టాంప్ డ్యూటీని తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తోంది. 


ఈ సెగ్మెంట్లలో ఇళ్లకు డిమాండ్
బలమైన ఫండమెంటల్స్ కారణంగా నివాస స్థిరాస్తి విభాగం (రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్) మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోందని CBRE ఇండియా చైర్మన్ & CEO అన్షుమాన్ మ్యాగజైన్ చెప్పారు. ఈ వేగం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని అంచనా వేశారు. కొత్త రెసిడెన్షియల్ యూనిట్ల ఆఫర్లు & విక్రయాలు రెండూ రాబోయే కాలంలో స్థిరం పెరుగుతాయని భావిస్తున్నారు. నోయిడా, బెంగళూరు, పుణె, చెన్నై వంటి నగరాల్లో లగ్జరీ, ప్రీమియం విభాగంలో ఇళ్లకు డిమాండ్ పెరుగుతోందని అన్షుమాన్ మ్యాగజైన్ వెల్లడించారు.            


మరో ఆసక్తికర కథనం: బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. మరి మంత్రిగారు కరుణించేనా ? 


ప్రస్తుత డేటా ఆధారంగా రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధిని మార్కెట్ నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. ముఖ్యంగా లగ్జరీ & ప్రీమియం సెగ్మెంట్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో కూడా ప్రీమియం లేదా లగ్జరీ సెగ్మెంట్‌లో ఎక్కువ కదలిక కనిపించింది. ఆ కాలంలో, బెంగళూరు, గురుగావ్‌ వంటి పెద్ద నగరాల్లో రూ. 10 నుంచి రూ. 80 కోట్ల బడ్జెట్‌తో ప్రీమియం ఆస్తుల అమ్మకాలు జరిగాయి. అదే సమయంలో, దిల్లీ-NCRలో విక్రయించిన మొత్తం ఆస్తులలో 80 శాతం పైగా ఆస్తుల విలువ రూ. 1 కోటి లేదా కంటే ఎక్కువగా ఉంది.                


మరో ఆసక్తికర కథనం: భారతీయ విమానయాన రంగానికి బడ్జెట్ 2025 నుంచి ఏమి ఆశించవచ్చు?