Employees: 


ఆసియా ఉద్యోగుల్లో చాలా మంది ఎడతెరపి లేకుండా పనిచేస్తున్నట్టు కనిపిస్తారని ఓ సర్వే తెలిపింది. అసలైన పని, ఉత్పాదకతను పక్కన పెట్టి నిరంతరం పని చేస్తున్నట్టుగా కనిపించేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది. ఈ జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. దాదాపుగా 43 శాతం మంది ఉద్యోగులు మెరుగ్గా పని చేస్తున్నట్టుగా రిపోర్టు చేస్తుంటారని వెల్లడించింది.


సేల్స్‌ఫోర్స్‌ సబ్సిడరీ కంపెనీ స్లేక్‌, రీసెర్చ్‌ ఫర్మ్‌ క్వాలిట్రిక్స్‌ సంయుక్తంగా 18,000 మంది డెస్క్‌ వర్కర్లు, ఎగ్జిక్యూటివ్స్‌ను అధ్యయనం చేశాయి. 'నిర్ణయాలు తీసుకోవడం, సమస్యల పరిష్కారానికి బదులు టీమ్‌ విజయాల గుర్తింపు సమావేశాల్లో ఎక్కువ సమయం గడపడాన్ని' పని చేస్తున్నట్టుగా స్లేక్స్‌ టెక్నాలజీ ఎవాంజెలిస్ట్‌ డెరెక్‌ లానీ నిర్వచించారు. ఈ అధ్యయనంలో తొమ్మిది దేశాలను తీసుకోగా 43 శాతంతో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. 37 శాతంతో జపాన్‌, 36 శాతంతో సింగపూర్‌ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 28 శాతంతో దక్షిణ కొరియా, అమెరికా ఆఖర్లో ఉన్నాయి.


తాము పనిలో బిజీగా ఉన్నామని తెలియజేసేందుకు 63 శాతం మంది ఉద్యోగులు తమ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉంచుతున్నారని సర్వే తెలిపింది. నిజానికి ఆ సమయంల పని చేయనప్పటికీ అలా చేస్తున్నారని పేర్కొంది.


సందేశాలకు వెంటనే బదులివ్వడాన్ని ఒత్తిడిగా ఫీలవుతామని, పని గంటలు ముగిశాక చేసినా అలాగే భావిస్తామని 53 శాతం మంది అంటున్నారు. విపరీతంగా పని చేస్తున్నారని, ఉత్పాదకతలో మెరుగ్గా ఉన్నట్టు సహచరులు గుర్తించాలన్న ఉద్దేశంతో 50 శాత మంది ప్రెజర్ ఫీలవుతారని తెలిసింది.


ఆన్‌లైన్‌లో ఎక్కువ గంటలు గడపడం, ఎక్కువ ఈమెయిల్స్‌ పంపించడం ఉత్పాదకతను కొలిచేందుకు కొలమానంగా ప్రపంచ వ్యాప్తంగా 26 శాతం మంది నాయకులు భావిస్తారట. బిజీగా ఉన్నట్టుగా కనిపిస్తేనే అవతలి వారు ప్రభావం చెందుతారని ఎక్కువ మంది భావిస్తున్నారు. సుదీర్ఘ సమయాలు పని చేయడం, ఈమెయిల్స్‌కు వెంటనే బదులివ్వడం, ప్రతి సమావేశంలో పాల్గొనడాన్ని చాలా మంది ఒత్తిడిగా ఫీలవుతున్నారు.


'ఎక్కువ మంది లీడర్లు సాధించిన లక్ష్యాలను బట్టి కాకుండా తమ కళ్ల ముందర పనిచేస్తేనే ఉత్పాదకతను నిర్ణయిస్తున్నారు. అందుకే ఉద్యోగులు తమ టీమ్‌ లీడర్ల ముందు బాగా పనిచేస్తున్నట్టుగా ప్రదర్శన చేస్తారు. దీంతో లీడ్స్‌ వృథా అవుతున్నాయి' అని సర్వే వివరించింది.


Also Read: మిమ్మల్ని అస్సలు టెన్షన్‌ పెట్టవీ హైబ్రిడ్‌ ఫండ్స్‌, ఇది రిస్క్‌ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్‌ 


Also Read: ఓ మై గాడ్‌! 7.44 శాతానికి పెరిగిన రిటైల్‌ ఇన్‌ప్లేషన్‌