Stock Market Today, 18 April 2024: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌ రావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్‌లో, ఈ రోజు (గురువారం) కూడా నెగెటివ్‌ స్టార్ట్‌ను చూసే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్‌తో పాటు Q4 FY24 ఆదాయాలు, తగ్గిన చమురు ధరలను కూడా గుర్తు పెట్టుకుని ట్రేడ్‌ చేస్తారు.


మంగళవారం, నిఫ్టీ 22,147.90 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,199 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో.. ఈ ఉదయం, నికాయ్‌, హాంగ్ సెంగ్, షాంఘై కాంపోజిట్‌ 0.2 శాతం చొప్పున తగ్గాయి. ASX 200, కోస్పి వరుసగా 0.4 శాతం, 1.5 శాతం పెరిగాయి.


యూఎస్‌ మార్కెట్లలో.. డౌ జోన్స్‌ 0.12 శాతం నష్టపోయింది. S&P 500 0.58 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 1.15 శాతం పడిపోయాయి.


అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.6% నుంచి తగ్గి, 4.577 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ 3% పైగా తగ్గింది, $87 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ గరిష్టాల నుంచి దిగి వచ్చింది, ఔన్సుకు $2,384 దగ్గర ఉంది. 
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మాస్‌టెక్, నేషనల్ స్టాండర్డ్ (ఇండియా), నెట్‌వర్క్18 మీడియా, ఓరియంటల్ హోటల్స్, స్వరాజ్ ఇంజిన్స్, TV18 బ్రాడ్‌కాస్ట్, యాక్సెల్య సొల్యూషన్స్ ఇండియా.


ఇన్ఫోసిస్: ఈ ఐటీ మేజర్ జనవరి-మార్చి త్రైమాసికం ఆదాయాల రిపోర్ట్‌ను ఈ రోజు ప్రకటిస్తుంది. లో సింగిల్ డిజిట్ గ్రోత్‌ నమోదు చేయవచ్చని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. లార్జ్‌ డీల్స్ తగ్గొచ్చని భావిస్తున్నారు.


వొడాఫోన్‌ ఐడియా: రూ.18,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) ప్రారంభానికి ముందు, 4.9 బిలియన్ షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించింది. ఒక్కో షేర్‌ను రూ. 11 చొప్పున కేటాయించింది, FPO ప్రైస్ బ్యాండ్‌లో టాప్ ఎండ్‌ను బట్టి- రూ.5,400 కోట్లు సేకరించింది.


ICICI లాంబార్డ్: ప్రీమియం, పెట్టుబడి ఆదాయంలో ఆరోగ్యకరమైన వృద్ధి కారణంగా Q4 FY24లో నికర లాభం పెరిగింది. Q4FY23లోని రూ.436.96 కోట్ల నుంచి సంవత్సరానికి (YoY) 18.9 శాతం పెరిగి రూ.519.50 కోట్లకు చేరుకుంది.


టాటా కమ్యూనికేషన్స్: Q4 ఏకీకృత నికర లాభం మార్చి త్రైమాసికంలో స్వల్పంగా తగ్గి రూ. 321.55 కోట్లకు చేరింది. ఇది క్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 326.64 కోట్లుగా ఉంది. ఏకీకృత ఆదాయం 24.5 శాతం వృద్ధితో రూ. 5,691.70 కోట్లకు చేరుకుంది.


పేటీఎం: తన అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లైసెన్స్ దరఖాస్తు వాయిదా, మాతృ సంస్థలో చైనీస్ షేర్ హోల్డింగ్ కారణంగా జరిమానాలకు సంబంధించి కంపెనీకి ఎలాంటి సమాచారమూ అందలేదని ప్రకటించింది.


అంబుజా సిమెంట్స్: అదానీ కుటుంబం అంబుజా సిమెంట్స్ కోసం జారీ చేసిన చివరి విడత వారెంట్లను కన్వెర్ట్‌ చేసింది, ఈ సిమెంట్ కంపెనీలో మరో రూ. 8,339 కోట్లు పెట్టుబడి పెట్టింది. తద్వారా సిమెంట్ సంస్థలో తమ వాటాను 70.3 శాతానికి పెంచుకుంది. 


ఏంజెల్ వన్: Q4 FY24 నికర లాభం సంవత్సరానికి 27 శాతం పెరిగి రూ. 340 కోట్లకు చేరుకుంది. ఏకీకృత ఆదాయం 65 శాతం పెరిగి రూ.1,357 కోట్లకు చేరుకుంది.


IIFL ఫైనాన్స్: ప్రతి తొమ్మిది ఈక్విటీ షేర్లకు ఒక ఈక్విటీ షేర్ చొప్పున రైట్స్‌ ఇష్యూని IIFL ఫైనాన్స్ బోర్డు ఆమోదించింది. గోల్డ్ లోన్ వ్యాపారంపై నిషేధం కొనసాగుతోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఐదు కంపెనీల్లో షేర్లు అమ్మేసిన రేఖ ఝున్‌ఝున్‌వాలా, ఈ స్టాక్స్‌ మీ దగ్గర ఉన్నాయా?