Stock Market Today, 17 May 2024: గ్లోబల్‌ మార్కెట్లలో నీరసం, ఎఫ్‌ఐఐల అమ్మకాల వల్ల భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం) స్తబ్దుగా ప్రారంభం కావచ్చు. ఇండియన్‌ మార్కెట్‌లో FIIల విక్రయాల జోరు స్వల్పంగా తగ్గింది. నిన్న, ఎఫ్‌ఐఐలు నికరంగా రూ.776.49 కోట్ల సేల్స్‌ చేశారు. DIIలు నికరంగా రూ.2,127.81 కోట్ల కొనుగోళ్లు చేశారు.


గురువారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ 22,403 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,475 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో, ఈ ఉదయం, కొరియాకు చెందిన కోస్పి 0.6 శాతం క్షీణించగా, జపాన్‌కు చెందిన నికాయ్‌, ఆస్ట్రేలియాకు చెందిన ASX200 ఇండెక్స్‌ 0.5 శాతం చొప్పున తగ్గాయి. 
 
యుఎస్‌లో, నిన్న, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మొదటిసారి 40,000 మార్క్‌ను దాటింది, ఆ తర్వాత  0.1 శాతం క్షీణించింది. S&P 500 ఇండెక్స్‌ 0.21 శాతం పడిపోయింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.26 శాతం తగ్గింది.


అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా పెరిగి 4.369 శాతానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $83.59 వద్ద ఉంది. చేరింది. డాలర్‌ బలపడడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు ఒక అడుగు వెనక్కు వేసింది, ఔన్సుకు $2,382 దగ్గర ట్రేడ్‌ అవుతోంది.
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: JSW స్టీల్, జైడస్ లైఫ్‌సైన్సెస్, NHPC, ఆస్ట్రల్, రైల్ వికాస్ నిగమ్, ఫీనిక్స్ మిల్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, గ్లోబల్ హెల్త్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటిక్, డెలివెరీ, బంధన్ బ్యాంక్, ఫైజర్, వినతి ఆర్గానిక్స్, పాలీ మెడిక్యూర్, శోభా, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, వర్రోక్ ఇంజినీరింగ్, కిర్లోస్కర్ ఫెర్రస్ ఇండస్ట్రీస్, బల్రామ్‌పూర్ చినీ మిల్స్, ధనుకా అగ్రిటెక్, సుదర్శన్ కెమికల్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, షిప్పింగ్ కార్ప్ ఆఫ్ ఇండియా.


రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ ఇండస్ట్రీస్ విభాగమైన రిలయన్స్ రిటైల్, భారతదేశ రిటైల్ మార్కెట్లో తన బిజినెస్‌ పెంచుకోవడానికి UKకు చెందిన ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్ ASOSతో ఒప్పందం కుదుర్చుకుంది. ASOS ఉత్పత్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో అమ్మడానికి డీల్‌ కుదిరింది. 


అదానీ పోర్ట్స్: మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణల కారణంగా నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ నుంచి ఈ కంపెనీని తొలగించారు.


వొడాఫోన్‌ ఐడియా: Q4 FY24లో ఆదాయం స్వల్పంగా పెరిగినప్పటికీ, నష్టం కూడా పెరిగింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే తం త్రైమాసికంలో (Q3FY24) రూ. 6,986 కోట్ల నష్టం వస్తే, ఇప్పడు అది రూ.7,674.6 కోట్లకు పెరిగింది. ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.10,606.8 కోట్లకు చేరుకుంది. ఎబిటా 0.3 శాతం తగ్గి రూ. 4,336 కోట్లకు చేరుకోగా, మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 40.9 శాతానికి చేరుకుంది.


బయోకాన్: 2024 జనవరి-మార్చి కాలంలో కంపెనీ ఏకీకృత నికర లాభం భారీగా 56 శాతం తగ్గి రూ. 135.5 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 3 శాతం పెరిగి రూ.3,917 కోట్లకు చేరింది. ఎబిటా కూడా ఏడాది ప్రాతిపదికన (YoY) 8 శాతం తగ్గి రూ.916 కోట్లుగా నమోదైంది. మార్జిన్ కూడా తగ్గింది, 23.4 శాతానికి దిగి వచ్చింది.


కాంకర్: మార్చి త్రైమాసికంలో, ఈ ప్రభుత్వ రంగ సంస్థ లాభం 13.5 శాతం YoY పెరిగి రూ.317 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో 6.5 శాతం వృద్ధితో రూ.2,325 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎబిటా 11.4 శాతం పెరిగి రూ.498 కోట్లకు చేరుకుంది. మార్జిన్ 90 బేసిస్ పాయింట్లు పెరిగి 21.4 శాతంగా నమోదైంది. 


క్రాంప్టన్ గ్రీవ్స్: నికర లాభం గత ఏడాది కంటే 5.5 శాతం గ్రోత్‌తో రూ.138.4 కోట్లకు చేరుకుంది. ఆదాయం కూడా 9.5 శాతం వృద్ధితో రూ.1,961 కోట్లకు చేరుకుంది. అయితే, ఎబిటా 4 శాతం తగ్గి రూ. 203.6 కోట్లకు చేరుకుంది. ఫలితంగా మార్జిన్‌ కూడా గత ఏడాది ఇదే కాలంలోని 11.8 శాతంతో పోలిస్తే ఈసారి 10.4 శాతంగా నమోదైంది.


పీబీ ఫిన్‌టెక్‌: ఈ కంపెనీ ప్రమోటర్లు బ్లాక్ డీల్స్ ద్వారా 1.86 శాతం వరకు ఈక్విటీని విక్రయించనున్నారు. ఆ డబ్బును పన్ను చెల్లింపులు, భవిష్యత్ ESOP కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు నేషనల్‌ మీడియా తెలిపింది.


JK పేపర్: Q4 FY24లో కంపెనీ లాభం 1.7 శాతం తగ్గి రూ. 275.6 కోట్లకు పరిమితమైంది. రూ.1,719 కోట్ల ఆదాయం వచ్చింది. ఎబిటా గణనీయంగా  26 శాతం తగ్గింది, గత ఏడాది ఇదే కాలంలోని రూ. 483 కోట్ల నుంచి రూ. 358 కోట్లకు  క్షీణించింది. ఫలితంగా, మార్జిన్‌ 28.1 శాతం నుంచి 20.8 శాతానికి పడిపోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఫామ్‌-16లో ఏం ఉంటుంది, ఐటీఆర్‌ ఫైలింగ్‌లో ఈ డాక్యుమెంట్‌ ఎందుకు కీలకం?