Trinayani Today Episode : గాయత్రీ దేవి వల్లే తిలోత్తమ, వల్లభ, సుమనల సమస్య తీరుతుందని గురువుగారు అంటారు. దానికి తిలోత్తమ గాయత్రీ అక్కయ్య ఎక్కడుందో సర్వజ్ఞులు అయిన మీకే తెలుసు అంటుంది. అయితే గురువుగారు నాకే కాదు తిలోత్తమ నీకు కూడా తెలుసు అంటే అందరితో పాటు తిలోత్తమ కూడా షాక్ అయిపోతుంది.
సుమన: మాకు తెలిస్తే మీకు ఎందుకు అడుగుతాం స్వామి.
నయని: స్వామి అమ్మగారి ఆచూకి నీడ రూపంలో తెలిసింది కానీ ఆ తర్వాత మాకు ఎలాంటి ఆచూకి తెలీలేదు. ఇప్పుడు మీరు అమ్మగారి వల్లే వీరి సమస్య తీరుతుంది అంటున్నారు. ఎక్కడుంది తను.
గురువుగారు: ఇక్కడే కూర్చొని ఉంది కదా నయని.
దురంధర: ఏంటి గురువుగారు ఈ పిల్ల గాయత్రీ వదినా.
హాసిని: అవును..
తిలోత్తమ: ఈ పిల్లకి గాయత్రీ అక్కయ్య పూర్తి పేరు పెట్టినందుకే తను కూడా గాయత్రీ దేవి అవుతుందని మాత్రం చెప్పకండి గురువుగారు.
సుమన: ఎవరికీ ఇవ్వని ఆస్తిని ఈ పిల్లకు ఇచ్చారు. ఇప్పుడు మేం కూడా గాయత్రీ అత్తయ్యకు ఇచ్చిన మర్యాద ఇవ్వాలని చెప్పకండి.
గురువుగారు: లేదు నేను నిజమే చెప్తున్నా మీరే ఎక్కువ ఊహించుకొని కంగారు పడుతున్నారు.
విశాల్: స్వామి మీరు ఇలా చెప్తే.
గురువుగారు: మంచే జరుగుతుంది విశాలా.
నయని: నా తొలి బిడ్డ ఇనాళ్లు అయిన దొరకలేదని నేను పడుతున్న బాధ చూసి నేను సంతోష పడాలి అని ఇలా చెప్తున్నారా స్వామి.
తిలోత్తమ: ఈ పాపని గాయత్రీ అక్కయ్య అనుకోవాలా? గాయత్రీ అక్కయ్య నేనా?
గురువుగారు: పాపని ఎత్తుకోమని విశాల్‌కు చెప్తారు. ఈ పాపను నేను ఎందుకు గాయత్రీ దేవి అన్నాను అంటే నీ కన్నతల్లి చేతిలో నాగ రేఖ ఉన్నట్లే ఈ పాప అరచేతిలోనూ సర్పరేఖ ఉంది.
నయని: అమ్మగారి అంతటి మహాజ్జాతకురాలు అవుతుందని అందరూ అంటుంటారు స్వామి.
గురువుగారు: తప్పకుండా అవుతుంది నయని. సర్పరేఖ ఎవరికి అయితే వారి వల్లే శాప విమోచనం అవుతుంది. ఈ పాపనే గాయత్రీ దేవిగా భావించి శాపగ్రస్తుల అరచేతిలో విభూది రేఖలు గీయించండి.
సుమన: ఈ పిల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు చేతిలో నాగరేఖ ఉంది అంటే తనది ఆషామాషీ జాతకం కాదు.
గురువుగారు విభూది ఇస్తే విశాల్ దగ్గరుండి గాయత్రీ పాప చేతి ముగ్గురి మెడలకు విభూది రాయిస్తారు. తర్వాత ముగ్గురు గాయత్రీ పాప చుట్టూ నిల్చొని తలలు తగిలించుకొని విశాలాక్షి అమ్మవారికి క్షమాపణ చెప్తే పాము వచ్చి ముగ్గురి మెడను కాసేపు చుడుతుంది. తర్వాత నాగయ్య పాము వెళ్లిపోతుంది. తర్వాత ముగ్గురి గొంతు మామూలుగా మారిపోతుంది. ముగ్గురూ సంతోషిస్తారు.
నయని: గాయత్రీ దేవి ఫొటోతో.. అమ్మగారు ఎంత విచిత్రమో తెలుసా మీ అరచేతిలో ఉన్న నాగ రేఖ మేం దత్తత తీసుకున్న గాయత్రీ పాప చేతిలో కూడా ఉందట. పేరు ఒక్కటే నేను కన్న తర్వాత మీరు దూరం అయిపోయిన మీ వయసు తన వయసు ఒక్కటే. అన్ని విషయాల్లో మీ లాగే ఉంటున్న ఈ గాయత్రీకి మాకు ఏంటి సంబంధం. ఇంతలో హాసిని అక్కడికి వస్తుంది. విశాల్ కూడా వస్తాడు.
హాసిని కొత్త వంటలు చేశానని రకరకాలుగా మాట్లాడుతూ గ్యాప్ ఇవ్వకుండా నయనిని మాట్లాడకుండా చేస్తుంది. విశాల్ హాసినిని ఆపి నయనిని మాట్లాడించమని అంటాడు. నయని మాట్లాడితే నీకే ఇబ్బంది అని చిన్నగా హాసిని అంటుంది.
నయని: అదేంటి అక్క నేను ఎప్పుడైనా బాబుగారిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడానా..
విశాల్: నువ్వు చెప్పు నయని.
హాసిని: చెప్పుకుంటేనే ఇబ్బంది.
నయని: గాయత్రీ అమ్మగారి అరచేతికి నాగరేఖ ఉన్నట్లే పాప చేతికి కూడా ఎలా ఉంటుంది బాబుగారు.
విశాల్: అది.. అది.. దైవ నిర్ణయం నయని.
నయని: పేరు, వయసు, అర్హత అన్నీ గాయత్రీ అమ్మగారితో సరిపోల్చుకునేలా ఉందని అంటే మనకు తనకు ఎలాంటి సంబంధం ఉందంటావ్.
విశాల్: గాయత్రీకి నాకు గత జన్మ బంధం ఏదో ముడి పడి ఉండుంటుంది. పోయిన జన్మలో నేను తన బిడ్డగానో లేక తన బిడ్డగా నేనో పుట్టడం జరిగే ఉంటుంది.
పెద్దబొట్టమ్మ కళ్లు కనిపించడం లేదని రమణమ్మ చేయి పట్టుకొని ఇంటికి తీసుకొస్తుంది. ఇంతలో ఎద్దులయ్య ఎదురుగా వచ్చి కళ్లు కనిపించకుండా నటిస్తున్నావ్ అని అంటాడు. దీంతో పెద్ద బొట్టమ్మ కళ్లు తెరుస్తుంది. అయితే పెద్ద బొట్టమ్మ తనకు కళ్లు కనిపిస్తున్నాయని ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పొద్దని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?