Stock Market Today, 16 June 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.35 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 41 పాయింట్లు లేదా 0.22 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,801 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


యాక్సిస్ బ్యాంక్: ప్రైవేట్ పెట్టుబడి సంస్థ బైన్ క్యాపిటల్ గురువారం బ్లాక్ డీల్ ద్వారా యాక్సిస్ బ్యాంక్‌లో కొంత వాటాను విక్రయించింది. చాలా దేశీయ, విదేశీ ఫండ్స్‌ ఆ షేర్లను కొనుగోలు చేశాయి.


రామకృష్ణ ఫోర్జింగ్స్, టిటాగర్ వ్యాగన్స్‌: రామకృష్ణ ఫోర్జింగ్స్ & టిటాగర్ రైల్ సిస్టమ్స్‌తో కూడిన కన్సార్టియం 1.54 మిలియన్ల ఫోర్జ్‌డ్‌ వీల్స్‌ సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి గెలుచుకుంది.


గెయిల్: గెయిల్ (ఇండియా) డైరెక్టర్‌గా (మార్కెటింగ్) సంజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇంద్రప్రస్థ గ్యాస్‌లో MDగా పని చేశారు.


TVS మోటార్: ఎమరాల్డ్ హెవెన్ రియల్టీ లిమిటెడ్‌లో తనకున్న మొత్తం వాటా 43.54%ను TVS మోటార్ విక్రయించింది.


HCL టెక్: మైక్రోసాఫ్ట్ అజూర్ ఓపెన్ఏఐ సర్వీస్‌తో, జెనరేటివ్‌ AI ఇన్నోవేషన్‌, అడాప్షన్‌ పెంచడానికి HCL హెచ్‌, మైక్రోసాఫ్ట్‌ తమ భాగస్వామ్యాన్ని విస్తరించాయి.


విప్రో: కొత్త 5G-Def-i ఇన్నోవేషన్ సెంటర్‌ను టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ప్రారంభించినట్లు విప్రో ప్రకటించింది. తమ క్లయింట్లకు సురక్షిత, మరింత స్థిరమైన, అనుకూలమైన ఉత్పత్తులు & సేవల ద్వారా 5G సాంకేతికత ప్రయోజనాలను అందించడం కంపెనీ నిబద్ధతకు ఇది నిదర్శనమని వెల్లడించింది.


ఏంజెల్ వన్, HDFC లైఫ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్: ఈ మూడు షేర్లు ఈరోజు ఎక్స్-డివిడెండ్‌ ట్రేడ్‌ చేస్తాయి. ఈ కంపెనీలు ఇటీవల ప్రకటించిన డివిడెండ్‌ అమౌంట్‌ స్టాక్‌ ధర నుంచి ఇవాళ తగ్గిపోతుంది. కాబట్టి, ఈ షేర్లు ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


సంవర్ధన మదర్సన్: సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన సంవర్ధన మదర్సన్ ఆటోమోటివ్ సిస్టమ్స్, తన యూరోపియన్ అనుబంధ సంస్థల్లో ఒకదాని ద్వారా సిర్మా ఎంటర్‌ప్రైజ్‌లో 100% వాటాను కొనుగోలు చేయడానికి బైండింగ్ అండర్‌టేకింగ్‌పై సంతకం చేసింది.


నాట్కో ఫార్మా: విశాఖపట్నంలో, నాట్కో ఫార్మా డ్రగ్ ఫార్ములేషన్స్ తయారీ కేంద్రంలో యూఎస్‌ ఎఫ్‌డీఏ తనిఖీ ముగిసింది. దీనికి సంబంధించిన ఇన్‌స్పెక్షన్‌ రిపోర్ట్‌ను అందుకుంది.


రిలయన్స్ ఇండస్ట్రీస్: RIL, తన ఆయిల్‌-టు-టెలికాం వ్యాపారాల విస్తరణ కోసం 2 బిలియన్‌ డాలర్ల వరకు సేకరించేందుకు ఫారిన్‌ కరెన్సీ లోన్‌ లెండర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు బ్లూంబెర్గ్ నివేదించింది.


టెక్ మహీంద్ర: ఈ ఏడాది డిసెంబర్ 20 నుంచి కంపెనీ MD & CEOగా మోహిత్ జోషిని టెక్‌ మహీంద్ర నియమించింది. ప్రస్తుత CEO సీపీ గుర్నానీ డిసెంబర్ 19న పదవీ విరమణ చేస్తారు.


ఇది కూడా చదవండి: బంగారాన్ని చౌకగా కొనే సువర్ణావకాశం, 5 రోజులే ఈ స్పెషల్‌ ఆఫర్‌ 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.