మ్మర్ లో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రత కారణంగా మొహం వాడిపోయినట్టు కనిపిస్తుంది. సరైన చర్యలు తీసుకోకపోతే నిర్జీవంగా తేమ లేకుండా ఉంటుంది. అందుకే ఈ సీజన్ లోను మీ అందాన్ని మెరుగుపరిచే కొన్ని ఫేస్ ప్యాక్స్ ఇవి. ఈ కూలింగ్ ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల సమ్మర్ హీట్ ని అధిగమించవచ్చు అలాగే అందంగాను కనిపిస్తారు.


దోసకాయ, కలబంద ప్యాక్


దోసకాయ సగం ముక్క తీసుకుని దాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకుని జ్యూస్ తీసుకోవాలి. ఆ జ్యూస్ లో రెండు టెబుల్ స్పూన్ల కలబంద జెల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి రాసుకుని 15-20 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. ఇది ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దోసకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే కలబంద చర్మానికి మృదుత్వాన్ని అందిస్తుంది.


మింట్, పెరుగు ఫేస్ ప్యాక్


ఒక గుప్పెడు పుదీనా ఆకులు తీసుకుని వాటిని మెత్తగా మిక్సీ చేసి జ్యూస్ తీసుకోవాలి. అందులో పెరుగు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొహానికి రాసుకోవాలి. 15 నిమిషాల పాటు ఫేస్ కి ఉంచుకోవాలి. చల్లని నీటితో ఫేస్ కడుక్కోవాలి. మింట్ రిఫ్రెషింగ్, కూలింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది. పెరుగు చర్మానికి మాయిశ్చరైజింగ్, మృదుత్వాన్ని ఇస్తుంది.


పుచ్చకాయ, తేనె ప్యాక్


వేసవిలో పుచ్చకాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో నీటి శాతం ఎక్కువ. ఇది ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని కూడా ఇస్తుంది. కొన్ని పుచ్చకాయ ముక్కలు తీసుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. పుచ్చకాయ స్కిన్ కి వేడి తగ్గించి హైడ్రేట్ గా ఉంచుతుంది. తేనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.


ముల్తానీ మట్టి, రోజ్ వాటర్


చాలా మంది అమ్మాయిలు అనుసరించే సింపుల్ ఫేస్ ప్యాక్ ఇడి. ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిలో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని మొహం అంతా రాసుకోవాలి. 15-20 నిమిషాల పాటు ఆరిపోయే వరకు ఉంచుకోవాలి. రోజ్ వాటర్ కూలింగ్ ఇస్తుంది. ముల్తానీ మట్టి చర్మం మీద ఉండే అదనపు ఆయిల్ ని, మలినాలను తొలగించేందుకు సహాయపడుతుంది.


బొప్పాయి, తేనె


బాగా పండిన బొప్పాయి ముక్కలు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని మొహానికి అప్లై చేసుకుని 15-20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. బొప్పాయి చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. ఇక తేనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.


ఎటువంటి పదార్థాలతో అయినాఫేస్ ప్యాక్ వేసుకునే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ముఖ్యం. ఏదైనా అలర్జీ రియాక్షన్స్ ఉంటే ముందే తెలుస్తుంది. వేడి నెలల్లో చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకునేందుకు ఈ ఫేస్ ప్యాక్స్ చక్కగా ఉపయోగపడతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: మన దేశంలో ఏ సీజన్‌లో ఏయే పండ్లు, కూరగాయలు లభిస్తాయో తెలుసా?