భారతదేశంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. రుతువులకు తగినట్లుగా అనేక రకాల పండ్లు, కూరగాయలు లభిస్తాయి. వేసవి కాలం నుంచి చలికాలం వరకు వివిధ రకాల పంటలు పండిస్తూ రైతులు జీవనం సాగిస్తారు. కాలానుగుణంగా పంటలు వేస్తూ ఉంటారు. అయితే ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించి ఏడాది పొడవునా సీజన్ తో సంబంధం లేకుండా పండ్లు, కూరగాయలు పండించే వాళ్ళు కూడా ఉన్నాయి. కానీ సాంప్రదాయకంగా వచ్చే కొన్ని పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఏయే సీజన్ లో ఎటువంటివి పండిస్తారో తెలుసా?
వేసవి( మార్చి నుంచి మే వరకు)
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వేసవి వేడిని అధిగమించేందుకు వివిధ రకాల రీఫ్రెష్ పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉంటాయి. ఈ సీజన్ లో జ్యూసీగా ఉండే పుచ్చకాయలు, నోరూరించే మామిడి పండ్లు ప్రధానంగా కనిపిస్తాయి. పుచ్చకాయలోని అధిక నీటి కంటెంట్, సహజమైన తీపితో ఈ పండ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవే కాదు దోసకాయలు, టొమాటోలు, గుమ్మడికాయ, స్నేక్ మిలాన్ లేదా కక్డి, మునగకాయ, జాక్ ఫ్రూట్, దొండకాయ, సొరకాయ, బీరకాయ, కాకరకాయ పండుతాయి.
వర్షా కాలం( జూన్ నుంచి సెప్టెంబర్)
రుతుపవనాల రాకతో ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎండిపోయిన భూములకి వర్షంతో నీటిని అందిస్తుంది. సమయానికి వర్షాలు పడటం వల్ల పంటల సంపద, వృద్ధి పెరుగుతుంది. ఈ సీజన్ లో బచ్చలి కూర, మెంతి ఆకు, ఉసిరిఆకు వంటివి వృద్ధి చెందుతాయి. వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు అందటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. భుట్టా అని పిలిచే ఫేమస్ మొక్క జొన్న ఈ సీజన్ లోనే లభిస్తుంది. తియ్యని లిచీలు, టార్ట్ జామున్, సువాసన కలిగిన జామ పండ్లు దొరుకుతాయి.
శరదృతువు(అక్టోబర్ నుంచి నవంబర్)
రుతుపవనాల నుంచి చల్లటి ఉష్ణోగ్రతలోకి వాతావరణం మారిపోతుంది. ఈ టైమ్ లో కూడా కాలానుగుణంగా పండ్లు పండుతాయి. పియర్స్, దానిమ్మ, యాపిల్, తీపి ద్రాక్ష వంటి పండ్లు ఈ సీజన్ లో అధికంగా లభిస్తాయి. క్యారెట్, టర్నిప్, ముల్లంగి, చిలగడదుంప, క్యాలీఫ్లవర్, బీన్స్ వంటి కూరగాయలు మార్కెట్ లో దర్శనమిస్తాయి.
శీతాకాలం( డిసెంబర్ నుంచి ఫిబ్రవరి)
మంచు వాతావరణం చల్లని గాలులుతో పాటు నోరూరించే పండ్లు కూడా ఈ సీజన్ లో లభిస్తాయి. నారింజ, నిమ్మకాయ, స్వీట్ లైమ్ వంటి సిట్రస్ పండ్లు అందుబాటులో ఉంటాయి. పోషకాలు అధికంగా ఉండే బచ్చలికూర, మెంతి ఆకులు వంటి ఆకు కూరలు కూడా లభిస్తాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులోని బెల్ పెప్పర్స్, క్యాలీఫ్లవర్, క్యారెట్లు, తాజా బఠానీలు దొరుకుతాయి. ఈ పదార్థాలు చలి నెలల్లో మాత్రమే లభిస్తాయి. అందుకే వీటిని చాలా మంది ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చూసుకుంటారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఒక గ్లాసు నీటిలో వీటిని కలిపి తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం