Stock Market Today, 07 September 2023: అమెరికా ఆర్థిక డేటా అంచనాలకు మించి ఉండడంతో,  యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును ఎక్కువ కాలం కొనసాగించవచ్చు అన్న అంచనాలతో డాలర్ బలపడింది. ఇది, రాత్రి వాల్ స్ట్రీట్‌లో అమ్మకాలకు దారి తీసింది. అమెరికన్‌ మార్కెట్లను అనుసరించి ఆసియా మార్కెట్లు పడిపోయాయి. గ్లోబల్‌ సూచీల్లో బలహీనమైన సెంటిమెంట్‌ కారణంగా ఇవాళ భారత మార్కెట్ జాగ్రత్తగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 


నిన్న సెన్సెక్స్ 100.26 పాయింట్లు లేదా 0.15% పెరిగి 65,880.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 36 పాయింట్లు లేదా 0.18% పెరిగి 19,543.80 వద్ద క్లోజ్‌ అయింది. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, FMCG, ఆయిల్‌ &గ్యాస్‌ స్టాక్స్‌ సూచీలను నడిపించాయి.


ఇవాళ ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 6.5 పాయింట్లు లేదా 0.03 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,631 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


సఫారీ ఇండస్ట్రీస్: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ 'ఇన్వెస్ట్‌కార్ప్', లగేజ్‌ మేకర్‌ సఫారీ ఇండస్ట్రీస్‌లో తన వాటాను విక్రయించింది. సఫారీ ఇండస్ట్రీస్ నుంచి తన పెట్టుబడిపై 3.8 రెట్ల రాబడితో మొత్తం రూ.285 కోట్లు పొందింది.


రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్, అలియా భట్‌కు చెందిన కిడ్ అండ్ మెటర్నిటీ ఫ్యాషన్ బ్రాండ్ Ed-a-Mammaలో మెజారిటీ వాటా కొనుగోలు చేసింది.


TVS మోటార్: టీవీఎస్‌ మోటార్ కంపెనీ, తన ఐకానిక్ అపాచీ లైనప్‌లోకి TVS Apache RTR 310ను కొత్తగా యాడ్‌ చేసింది.


పేటీఎం: బీమా వ్యాపారాన్ని ప్రారంభించే ప్రణాళికలను నుంచి పేటీఎం రద్దు చేసుకుందని ET Now రిపోర్ట్‌ చేసింది. ఈ కంపెనీ, పేమెంట్స్‌ & క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారంపై మాత్రమే ఫోకస్‌ పెడుతుందని నివేదించింది.


లుపిన్: COPD రోగులకు మందుల అందుబాటును పెంచేందుకు మార్క్‌ క్యూబన్ కాస్ట్ ప్లస్ డ్రగ్ కంపెనీ, COPD ఫౌండేషన్‌తో కలిసి లుపిన్ పని చేస్తుంది.


టాటా కన్జ్యూమర్‌: హల్దీరామ్‌లో 51% వాటాను కొనుగోలు చేసేందుకు ఆ కంపెనీతో చర్చలు జరపడం లేదని టాటా కన్స్యూమర్ ప్రకటించింది. టాటా గ్రూప్‌ FMCG విభాగం, మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి హల్దీరామ్‌తో చర్చలు జరుపుతోందని నేషనల్‌ మీడియా రిపోర్ట్‌ చేసింది.


ఫోర్స్ మోటార్స్: ఫోర్స్ మోటార్స్ ఆగస్టులో 3,032 యూనిట్లను ఉత్పత్తి చేసింది, దేశీయంగా 2,601 యూనిట్లను విక్రయించింది.


అదానీ టోటల్ గ్యాస్: అదానీ టోటల్ గ్యాస్ అహ్మదాబాద్‌లో రోజుకు 500 టన్నుల బయో-CNG ప్లాంట్ కోసం ఆర్డర్‌ దక్కించుకుంది.


HCL టెక్‌: వ్యాపార కార్యకలాపాల్లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను వేగవంతం చేయడానికి ఆస్ట్రేలియాకు చెందిన ఎల్డర్స్‌, HCL టెక్‌ను ఎంచుకుంది. ఇది అనేక సంవత్సరాలు సాగే ఒప్పందం.


ఇది కూడా చదవండి: టర్మ్‌ పాలసీ అయినా కట్టిన డబ్బంతా తిరిగి వస్తుంది, ఎల్‌ఐసీ జీవన్‌ కిరణ్‌ పూర్తి వివరాలివి


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial